పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ ప్రోమో సంచలనం సృష్టించింది. యూట్యూబ్, మ్యూజికల్ చార్ట్‌లలో నంబర్ వన్ గా ట్రెండింగ్ లో నిలిచింది. దేశం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న ‘అక్డీ పక్డీ’ పూర్తి పాట ఇప్పుడు విడుదలైయింది. అక్డీ పక్డీ మెస్మరైజింగ్ మాస్ బీట్స్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించింది. పాటలో వినిపించిన సాహిత్యం క్యాచీగా ఉంటూ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్ ని అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ బ్యాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫ్రెష్ ఉంటూ అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా జోష్ క్రియేట్ చేసింది అక్డీ పక్డీ. సునీల్ కశ్యప్ ఇచ్చిన హుక్ లైన్ లైగర్ విజయ్ డ్యాన్స్ మూమెంట్ లానే అదిరిపోయింది. లిజో జార్జ్-డిజె చేతాస్ స్వరపరిచిన ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్, స్టన్నింగ్ డ్యాన్స్‌లు అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. డ్యాన్స్ మూమెంట్స్ లో విజయ్ దేవరకొండ గ్రేస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. విజయ్ కి జోడీగా అనన్య పాండే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. అక్డీ పక్డీ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట తమిళ వెర్షన్ కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు. విష్ణు వర్ధన్, శ్యామ మలయాళ వెర్షన్ ని ఆలపించగా, సిజు తురవూర్ సాహిత్యం అందించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్ ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్ లు ఆలపించారు. సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్ గా వున్నారు. లైగర్ నుండి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ సినిమా పై భారీ అంచనాలు, ఆసక్తిని పెంచుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యధిక లైక్స్ సొంతం చేసుకోగా.. ఫస్ట్ గ్లింప్స్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రోమో టాప్ 3 లిస్ట్‌లో ఉండగా, ఈ పాట గతంలోనే వున్న అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. లైగర్ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
Month: July 2022
Ginna First Look: Perfect mass action film from Vishnu is loading
Vishnu Manchu’s upcoming film ‘Ginna’ has created a great buzz among moviegoers. Since the inception of the project, the talented actor has been coming up with different ideas to promote the film and make the audience surprised time and again. The first look of Vishnu as Gali Nageshwara Rao from Ginna was released today. Unlike others, the movie team released a video, which introduces the Manchu actor as Ginna. Donning white shirt and pant, Vishnu looked like a perfect mass hero in the video and his character in the movie…
ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచుతున్న ‘జిన్నా’ ఫస్ట్ లుక్
విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటీ నటులుగా డైనమిక్ డైరెక్టర్ ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న చిత్రం “జిన్నా”.ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు..శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, మరియు చోటా కే నాయుడు కనిపించడం విశేషం. ఈ ఫస్ట్ లుక్ లో మంచు విష్ణు ను చూస్తుంటే వైట్ & వైట్ డ్రెస్ లో ఉన్న లుక్ కు సినీ అభిమానులలో మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేయడమే కాక ఈ ‘జిన్నా’ చిత్రం…
Shyamal Bhumika launch WEDDING COUTURE 2022 in Hyderabad with Aditi Rao Hydari
Hyderabad, July 2022: Launching exclusively first at Shyamal and Bhumika’s Hyderabad store, The Wedding Couture Collection 2022 by the iconic couturiers is a beautiful line of hand-embroidered masterpieces, designed using age-old craft techniques in the most unusual mix of silhouettes and colours. The duo’s deep-rooted reverence for the rich culture and heritage of the Indian sub-continent shines through this season. Encouraged by a festive mood the couturiers have sought inspiration from nature, our history and traditions, ancient architecture, splendor of the royal courts, museums, rare private collections and antique markets.…
హైదరాబాద్‌లో శ్యామల్ & భూమిక ది వెడ్డింగ్ కోచర్ కలెక్షన్ 2022ను ప్రారంభించి సందడి చేసిన ప్రముఖ నటి అదితి రావు హైదరి
హైదరాబాద్, జూలై 2022 : శ్యామల్ మరియు భూమిక యొక్క ది వెడ్డింగ్ కోచర్ కలెక్షన్ 2022ను తమ అన్ని స్టోర్ల కంటే ముందు హైదరాబాద్ స్టోర్‌లోనే మొదటిసారి ప్రత్యేకంగా ప్రారంభించబడింది, ది వెడ్డింగ్ కోచర్ కలెక్షన్ 2022 అనేది ప్రసిద్ది చెందినటువంటి ఫ్యాషన్ డిజైన్ వస్త్రశ్రేణి, ఇవి చేతితో ఎంబ్రాయిడరీ చేయబడిన చిత్రాలు మరియు రంగులతో నిండిన మాస్టర్‌పీస్‌లకు చెందిన అందమైన శ్రేణికి చెందినవి, పురాతనమైన హస్తకళా నైపుణ్యాలను ఉపయోగించి వీటిని రూపొందించడం జరిగింది. భారత ఉపఖండంకు చెందిన గొప్ప సంస్కృతి మరియు వారసత్వం పట్ల వీరిద్దరికి ఉన్నటువంటి అమితమైన గౌరవం ఈ కలెక్షన్‌లో ప్రకాశిస్తుంది. పండుగ వాతావరణం అందించిన ప్రోత్సాహంతో ప్రకృతి, మన చరిత్ర మరియు సంప్రదాయాలు, పురాతన వాస్తుశిల్పం, రాజ దర్బార్‌ల వైభవం, మ్యూజియంలు, అరుదైన ప్రయివేట్ కలెక్షన్ మరియు పురాతన వస్తువుల…
ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో – ధనుష్ కోసం ఇండియా వస్తున్న రూసో బ్రదర్స్!!
ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. జూలై 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో ఫేమస్. హాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలు తీశారు. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘ది గ్రే మ్యాన్’ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ”హాయ్! మేం రూపొందించిన కొత్త సినిమా ‘ది గ్రే మ్యాన్’ ప్రదర్శనకు, మా స్నేహితుడు…
పాట మినహా సమంత ‘యశోద’ షూటింగ్ పూర్తి
ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన సమంత ‘యశోద’ చిత్రం షూటింగ్ ఒక సాంగ్ మినహా టాకీ మొత్తం పూర్తి శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘’సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో మా యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కుడా అదే స్థాయిలో చేయబోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియన్…
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసి మేకర్స్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీజర్ ఆసక్తికరంగా వుందని ప్రసంశించిన ఆయన, ప్రాజెక్ట్ కు కలిసి పనిచేసిన యంగ్ టీమ్ ని అభినందించారు. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదల గురించి ఒక హిందీ వాయిస్ ఓవర్ లో మొదలైన టీజర్ ఆద్యంతం…
ఘనంగా ‘హైయ్ ఫైవ్’ ప్రీ రిలీజ్ వేడుక – జులై 22న విడుదల
నృత్యదర్శకుడి నుంచి `రణం` చిత్రంతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం `హైయ్ ఫైవ్`. ఫన్ అండ్ గన్ అనేది ఉపశీర్షిక. రాధా రాజశేఖర్ నిర్మాత. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కొత్త పాత నటీనటుల కలయికతో రూపొందిన ఈ చిత్రం జూలై 22న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ దస్‌పల్లా హోటల్‌లో ఘనంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యతిథి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, అమ్మను ఎవరైతే చక్కగా చూసుకుంటారో వారు అందరికన్నా ధనవంతులు. అమ్మ రాజశేఖర్ సక్సెస్ వస్తే నా కుటుంబానికి వచ్చిందని అనుకునేవారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా వుంటారు. హైయ్ ఫైవ్ సినిమా మొదలు పెట్టినప్పుడు నాకు చెప్పాడు. ఆ తర్వాత చాలా కష్టాలు, ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఎదుర్కొన్నానని అన్నాడు. అవన్ని ఎదుర్కుకొని…
‘మరో ప్రపంచం’ చిత్ర ట్రైలర్ విడుదల
చక్ర ఇన్ఫోటైన్‌మెంట్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై కిలారు నవీన్ దర్శకత్వంలో నిర్మాత వెంకటరత్నం నిర్మిస్తోన్న చిత్రం ‘మరో ప్రపంచం’. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన తారాగణంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు. చిత్ర పోస్టర్ లుక్‌ను అతిథులు సాగర్ కె చంద్ర, సాయికిరణ్ అడివి విడుదల చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఈ ట్రైలర్ చూపించాడు. నాకు నచ్చి ఈ కార్యక్రమానికి వచ్చాను. మనందరిలోనే చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి.. అలాంటిది ఓ ఐదుగురి ప్యారలల్…