స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. # సీతారామం మీ బ్యానర్ లో మరో ‘మహానటి’ అవుతుందని భావిస్తున్నారా ? – చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే…
Month: July 2022
‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్ లుక్ విడుదల
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా వుంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.…
‘బింబిసార’కు కళ్యాణ్ రామన్న తప్ప మరొకరు న్యాయం చేయలేరు : ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో.. స్టార్ హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ‘‘రెండేళ్ల క్రితం కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.. చాలా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను.. నువ్ ఒకసారి వింటే బాగుంటుందని అని అన్నారు. ఇప్పుడు వశిష్ట అంటున్నారు.. అంతకు ముందే వేణు అనేవాళ్లు. నాకు కూడా తనని వేణు అని పిలిస్తే బావుంటుంది. ఆ రోజు ఒక…
షూటింగ్స్ నిలిపేసే ప్రసక్తే లేదుః టియఫ్‌సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ… ఆ నలుగురు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ మండిపడ్డారు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమలో మాట్లాడుతూ…“ ఫిలిం ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న కొన్ని సమస్యల పై స్పందిచడానికి ఈ రోజు మా తెలంగాణ ఫిలించాంబర్ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మా టియఫ్‌సీసీ లో ప్రస్తుతం యాభై మంది నిర్మాతలు సినిమా షూటింగ్ లు నిర్వహిస్తున్నారు. నా సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇంకా రెండు రోజులే బేలన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్స్ ఆకస్మాత్తుగా ఆపేస్తే వర్కర్స్ తో పాటు మిగతా వారందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ నిలిపివేస్తున్నారని పత్రికల్లో, ఛానల్స్ లో వార్తలు చదువుతున్నాం. అసలు…
హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం
ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్‌ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్‌ను సంస్థ ఫౌండర్ మరియు ఛైర్మన్ రవి కుమార్ పనస తాజాగా ప్రారంభించారు. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు లిక్కర్ బ్రాండ్స్ లభ్యం కానున్నాయి. హైదరాబాద్‌లో అతి పెద్ద లిక్కర్ మార్ట్‌గా పేరొందిన ఈ సూపర్‌స్టోర్‌లోని బ్రాండ్స్‌కి పలు ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా ‘ML’ ప్రీమియమ్ లగ్జరీ లిక్కర్ మార్ట్ సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రవి కుమార్ పనస మాట్లాడుతూ.. ‘‘ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ మార్ట్ ‘ML’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు బ్రాండ్స్‌ను హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉంచడం జరిగింది.…
దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన శివ నాగేశ్వరరావు ‘దోచేవారెవరురా’ టీజర్
IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా “దోచేవారెవరురా” సినిమా టీజర్ విడుదల చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను శివ నాగేశ్వరరావు గారి సినిమాల్లోని కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈయన తెరకెక్కిస్తున్న “దోచేవారెవరురా” కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. అన్ని కార్యక్రమాలు…
ప్రముఖ దర్శకులు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్
ప్రముఖ దర్శకులు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు ఎంతో ఫేమస్. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ‘పసలపూడి’ వంశీ సొంతూరు. దానికి సమీపంలోని ‘గొల్లల మామిడాడ’ కె. రామచంద్రారెడ్డి ఊరు. ఆయన 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పసలపూడి కథలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకని, తన పీహెచ్‌డీకి పరిశోథనాంశంగా ఎంచుకున్నారు. ఆయనదీ గోదావరే కాబట్టి అక్కడి యాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. వంశీ ‘పసలపూడి కథలు’పై పీహెచ్‌డీ చేసిన…
జర్నలిజంలో గుడిపూడి శ్రీహరిని ఆదర్శంగా తీసుకోవాలి : సంస్మరణ సభలో సినీ ప్రముఖులు
సీనియర్ సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి – నేటి జర్నలిస్టు జెమినీ శ్రీనివాస్ కు ఘన నివాళి తొలితరం సినీ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ స్థాపకుల్లో ఒకెరైన గుడిపూడి శ్రీహరి గతనెలలో మృతిచెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈతరం జర్నలిస్టు జెమినీ శ్రీనివాస్ కూడా హఠాన్మరణం పొందారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రస్తుత కమిటీ ఆధ్వర్యంలో వారిరువురికీ సంతాప సభ నిర్వహించింది. గురువారం సాయంత్రం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగిన ఈ సభకు సీనియర్ నటులు మురళీమోహన్, నిర్మాత ఆదిశేషగిరిరావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, దర్శకులు కాశీ విశ్వనాథ్, సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ దర్శకులు వైవిఎస్ చౌదరి, నిర్మాతల మండల సెక్రెటరీ ప్రసన్నకుమార్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత గోపీచంద్…
Nithiin, Sreshth Movies’ Macherla Niyojakavargam ‘Macherla Action Dhamki’ Released
Macherla Niyojakavargam starring the versatile star Nithiin is carrying exceptional buzz, thanks to all the impressive promotional material. All the three songs released so far by the team got tremendous response. As the release date is approaching, the team decided to step on the peddle and released the Macherla Action Dhamki. It is a small cut of a popular action sequence that ticks of all positives of a Perfect Mass Entertainer. It has a good dialogue, excellent action, and mindblowing background score. The dialogue – ‘Mahabharatamlo Dharamanni Kaapadatam kosam Lakshaladhi…
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ నుండి ‘నీ నవ్వే’ లిరికల్ వీడియో విడుదల
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే విడుదల ఫస్ట్ సింగల్, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో ‘నీ నవ్వే’ పాటని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. హీరో తన ప్రేయసి ప్రేమ ఊహల్లో తేలుతున్న ఈ పాట…