సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ గూస్ బంప్స్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ .. ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా వుంటుంది: దర్శకుడు పరశురాం

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Theatrical Trailer- Mental Mass Swag Is Out Now

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్. బ్రమరాంభ థియేటర్ లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు, చిత్ర దర్శకుడు పరశురాం మిగతా టీం సభ్యులు పాల్గొని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కేరింతల మధ్య ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరశురాం మాట్లాడుతూ.. ట్రైలర్ కి ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీ గా వుంది. ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా…

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Theatrical Trailer- Mental Mass Swag Is Out Now

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Theatrical Trailer- Mental Mass Swag Is Out Now

All the wait is over and it’s worth all the hype around the theatrical trailer of superstar Mahesh Babu’s most awaited flick Sarkaru Vaari Paata directed by Parasuram. The makers, as promised, dropped theatrical trailer of the movie today in presence of huge crowd in Bhramarambha Theatre. The trailer begins with Mahesh Babu carrying a bunch of keys in his hand and giving lecture to group of people and enlightening them the value of money. After a series of action blocks, the story shifts to a foreign location, where he…

‘పీ.కే’ రాజకీయ ప్రత్యక్షం.. విఫల ప్రయోగం కానున్నదా ?

Prashant-kishor

By Sk.Zakeer, Editor, Bunker News : ”రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు ” అని టిఆర్ఎస్ నిర్మాత,ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్న మాట.నిజమే మరి ! రాజకీయపార్టీ పెట్టడానికి ఒక ప్రాతిపదిక తప్పనిసరి.తాత్విక భూమిక అవసరం.ప్రజల నుంచి డిమాండ్ రావాలి.కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి ఈ మాటలు అంటుంటారు.2001 లో ఆయన పార్టీ పెట్టడానికి అవసరమైన ప్రాతిపదిక ‘తెలంగాణ’ ఆకాంక్ష.ప్రత్యేక తెలంగాణ డిమాండును ఇరుసుగా చేసుకొని కేసీఆర్ 21 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీని నిర్మించారు.ఇప్పుడా పార్టీ తెలంగాణలో ఎంత శక్తివంతంగా మారిందో,కెసిఆర్ ఎదురులేని మనిషిగా ఎట్లా మారారో కండ్ల ముందు కనబడుతున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయపార్టీని స్థాపించబోతుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.ఇందుకు కారణం ఆయన ట్రాక్ రికార్డు.ఆయనకు ఉన్న నెట్ వర్క్. కనీసం ఐదారుగురు…

ముస్లిమ్ సోదరులకు ఈద్-ముబారక్ : టి.ఆర్.ఎస్ నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్

ramzan wishes

పవిత్రమైన రంజాన్ సందర్బంగా ముస్లిమ్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిములందరికీ ఈ రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైందని, చంద్రుడు కనిపించడంతో ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు ముస్లిములలో చాలా మంది కఠినమైన నియమ నిష్టలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగించారని బొట్ల పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ అందరి జీవితాలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. ప్రతి ఒక్కరూ పేదలు పడే ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ మాసంలో…

‘దర్జా’ మూడో పాట విడుదల!

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని చేతుల మీదుగా ‘దర్జా’ మూడో పాట విడుదల

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని యాక్షన్ కింగ్ అర్జున్, టీజర్‌ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవలే ఆవిష్కరించారు. అవి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా చిత్రంలోని మూడో పాటని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని చేతుల మీదుగా చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. పాట విడుదల అనంతరం నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ‘‘…

మే 4న 16 బాషల చిత్ర దర్శకులకు ‘దాసరి’ సత్కారం

Dasari-Film-Awards

భారతదేశంలోని వివిధ ప్రాంతీయ మరియు హిందీ భాషలలో గుర్తింపు పొందిన 16 మంది చిత్ర దర్శకులకు దాసరి నారాయణరావు 75 వ జయంతిని పురస్కరించుకొని సత్కరించనున్నట్లు దాసరి కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ తాటివాక రమేష్ నాయుడు తెలిపారు. మే 4 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకులను సత్కరించుకోవటంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు , సాంకేతిక నిపుణులు, ఫెడరేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు . ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్-తెలుగు సినిమా వేదిక సమన్వయంతో అంగరంగ వైభవం గా జరిగే ఈ కార్యక్రమ కమిటీకి తాడివాక రమేష్ నాయుడు చైర్మన్ గా, జి.నెహ్రు, చైతన్య జంగ కో ఆర్డినేటర్స్ గా… విజయ్ వర్మ పాకలపాటి…

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్రకళ పై చిన్నచూపు : దర్శక రచయిత కవి శ్రీ బి.నర్సింగరావు

director b narasingaravu

కళారంగానికి ప్రాంతాలతో ప్రమేయం ఉండదని, రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర కళారంగాన్ని చిన్నచూపు చూస్తున్నాయని ప్రముఖ దర్శక రచయిత, కవి శ్రీ బి.నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు అయినప్పటికీ చిత్రలేఖనం, శిల్ప కళ వైపు ప్రభుత్వం ద్రుష్టి సారించలేదని ఆయన పెదవి విరిచారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రఖ్యాత చిత్రకారుడు కవి పద్మశ్రీ ఎస్.వి.రామారావు రచించిన “అలోలాంతరాళాలలో” పుస్తక ఆవిష్కరణ మహోత్సవం ఆత్మీయంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ బి.నర్సింగరావు మాట్లాడుతూ… ఆధునిక యాబ్ స్ట్రాక్ట్ చిత్రకళ ను కవిత్వాన్ని అర్ధం చేసుకుని అనుభూతి చెందాలని, రామారావు కవిత్వం అద్భుత అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే మేటి తెలుగు చిత్రకారుడు ఎస్.వి.రామారావు రచనలు, చిత్రకళ తో మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రచయిత శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు…

కన్నులపండువగా సినీ కార్మికోత్సవం!

కన్నులపండువగా సినీ కార్మికోత్సవం!

కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ సినీ కార్మికులందరూ చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు…