హోరాహోరీగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు : గెలుపొందిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్యానల్

గెలుపొందిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్యానల్
Spread the love

హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబు మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అలాగే ముళ్ళపూడి మోహన్ సెక్రటరీగా, తుమ్మల రంగారావు వైస్ ప్రెసిడెంట్ గా, రాజశేఖర్ రెడ్డి ట్రెజరర్ గా వీవీఎస్ఎస్ పెద్దిరాజు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇదే కమిటీలో కమిటీ మెంబర్స్ గా ఏడిద రాజా, ఇంద్రపాల్ రెడ్డి, వడ్లపట్ల మోహన్, ఇంద్రపాల్ రెడ్డి, సి.హెచ్. వరప్రసాదరావు, శైలజ జూజాల, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహన్రావు, బాలరాజు, గోపాలరావు వంటి వారు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం హోరాహోరీగా ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రానికి పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి గెలిచిన వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు

Related posts

Leave a Comment