`జబర్దస్త్` యాంకర్ అనసూయ అందంపై సోషల మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఆమె దిగే ఫొటో షూట్లు వివాదాలుగా మారుతుంటాయి. ఆమె వేసుకునే డ్రెస్ ట్రోల్‌కి గురవుతుంటుంది. మొత్తంగా అనసూయ ఏం చేసినా లోపాలను ఎత్తేందుకు లక్షల కళ్లు తీక్షణంగా చూస్తుంటాయి. అనసూయ `జబర్దస్త్` షోతో యాంకర్ గా ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా తన అందాలతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ కోసమే `జబర్దస్త్` షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా బుల్లితెరపై అందాల విందు వడ్డిస్తున్న అనసూయ మేకప్‌పై తాజాగా మరోసారి సోషల మీడియాలో చర్చ మొదలైంది. మేకప్‌లో ఎవరైనా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లని మేకప్ లేకుండా చూడలేం అనేట్టుగా ఉంటారు. అలానే అనసూయ విషయంలోనూ మేకప్‌కి సంబంధించిన చర్చ జరిగింది. కానీ ఈ హాట్ బేబీపై మాత్రం విమర్శలు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే మేకప్ లేకపోయినా అందంగానే ఉంటుంది అనసూయ. ఇప్పటికే పలు మార్లు మేకప్ లేకుండా కనిపించి ఆశ్చర్యానికి గురి చేసిన అనసూయ మరోసారి వితౌట్మేకప్ కనిపించింది. లేటెస్ట్ గా న్యూఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకప్ లేకుండా ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మేకప్ లేకుండా అనసూయ కనిపించిన తీరుపట్ల చర్చ మొదలైంది. కొంత మంది నెటిజన్లు మేకప్ లేకపోయినా అందంగానే ఉన్నారు రంగమ్మత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు అనసూయ అసలు రూపం ఇదే అంటూ సెటైర్లు వేస్తున్నారు.ప్రస్తుతం ఈ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏదేమైనా అనసూయ మాత్రం తాను అనుకున్నట్టుగానే ఉంటుంది. ఎంతో బోల్డ్ గానూ ఉంటుంది. తనకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తుంది. ఎవరి గురించి పట్టించుకోదు. ఎందుకంటే తనో సెలబ్రిటీ. తనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆమె కట్టు బొట్టు నచ్చని వాళ్లు ఏవో కామెంట్లు చేస్తుంటారు. అవన్నీ పట్టించుకుంటే అనసూయ అనే పేరు మనం వినేవాళ్లం కాదు. వాటిని దాటుకుని, విమర్శలను అంతే హుందాతనంతో స్వీకరించి ముందుకు సాగుతుందీ హాట్ యాంకర్. ముఖ్యంగా ఆమె దుస్తులపై చాలా విమర్శలు వచ్చాయి. వాటికి అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తుంటుంది అనసూయ. ఏదైనా ఓ పరిమితి మేరకే అని, హద్దులు దాటితే కంట్రోల్లో పెట్టాల్సిందే అనే సూత్రాన్ని బాగా నమ్ముతుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది అనసూయ.
Related posts
-
నార్సింగిలో మారియో క్లెయిర్ సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి…
Spread the love ప్రఖ్యాత మెన్, ఉమెన్ పారిస్ బ్రాండ్ సెలూన్ మారియో క్లెయిర్ నార్సింగిలో ప్రారంభమైంది. ఈ సెలూన్ ప్రారంభోత్సవంలో పలువురు... -
ఆ పార్టీలకు వెళితేనే బాలీవుడ్లో ఛాన్సులు వస్తాయ్ : రెజీనా
Spread the love సినిమాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తుండగా బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ఆలస్యమైందని ఎదురైన ఓ ప్రశ్నకు రెజీనా... -
బాణా సంచా ధరల మోత : ధరలతో కళతప్పుతున పండగలు!
Spread the love by -షేక్ వహీద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ -9848787917 ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని...