‘సైంధవ్’లో జాస్మిన్‌గా ఆండ్రియా జెర్మియా

Introducing Andrea Jeremiah As Jasmine From Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav
Spread the love

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇటీవలె రుహాని శర్మ పాత్రను డాక్టర్ రేణు గా పరిచయం చేశారు.
ఈరోజు ఈ సినిమాలో మరో కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో చేతిలో తుపాకీతో ఇంటెన్స్ లుక్ తో కనిపించింది ఆండ్రియా. పోస్టర్ లో స్పోర్ట్స్ బైక్‌ను కూడా గమనించవచ్చు.
ప్రధాన తారాగణం పాల్గొంటున్న సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ప్రముఖ సాంకేతిక ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ ట్యాగ్ మీడియా

Related posts

Leave a Comment