సూపర్ స్టార్ కృష్ణ జీవితం .. అత్యంత స్ఫూర్తిదాయకం!

superstar krishna jeevitham athyantha sooprthy dhayakam
Spread the love

-గజల్ మ్యాస్ట్రో డా.గజల్ శ్రీనివాస్

సుాపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ జీవితం స్ఫుార్తిదాయక కావ్యమని గజల్ మాష్ట్రో డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. సుాపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం రిలీజై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సినిమారంగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసారని అన్నారు. నటుడుగా, నిర్మాతగా దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుఠలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. భారతీయ చిత్ర చరిత్రలో సాంఘిక, జానపద, కౌబాయ్, చారిత్రాత్మక, జేమ్స్ బాండ్ పాత్రలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అవి అన్నారు. తెలుగు చలనచిత్ర గతిని మార్చిన హీరో కృష్ణ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యిచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణ ఫాన్స్ గౌరవాద్యక్షులు రాయప్రోలు శ్రీనివాస ముార్తి మాట్లాడుతూ ఇండియన్ సిరీస్ పై మొదటి కౌబాయ్ చిత్రంగా, పాన్ ఇండియా ముావీగా నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రంఏడు భాషలలో డబ్బు చేయబడి 125 దేశాలలో ప్రదర్శింపబడిందని అన్నారు. చైతన్య భారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షతన జరిగిన సభలో 50 కేజీల కేకును కట్ చేసారు. కృష్ణ అభిమానులుగా దశాబ్దాల పాటు అభిమాన సంఘాన్ని నడిపి, రంగస్థల నటులుగా పేరెన్నికగన్న శ్రీ మహ్మద్ ఖాజావలి, మానాపురం సత్యనారాయణ, పులఖండం ఉగాది లకు సుాపర్ స్టార్ కృష్ణ అవార్డ్స్ అందజేసారు. సుమారు 300మంది మహిళ లకు చీట్లు పంపిణీ చేసారు. పట్టణంలోని నాగార్జున ఫాన్స్ అధ్యక్షులు.యల్.డి ప్రసాద్,ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, కృష్ణ ఫాన్స్ నాయకులు బి. హెచ్. సుబ్బరాజు, గంట్లప్రసాద్, బోనం ప్రసాద్,తాతపుాడి రాంబాబుబమడారు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment