సురేష్ కొండేటి చేతుల మీదుగా ‘టేక్‌ డైవర్షన్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Take-Diversion-suresh-kondeti
Spread the love

శివానీ సెంథిల్‌ దర్శకత్వంలో ‘టేక్‌ డైవర్షన్‌’ అనే పేరుతో ఓ ప్రేమ కథాచిత్రం రూపొందుతోంది. ‘టేక్‌ డైవర్షన్‌’ చిత్రంలో ‘పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్‌ ప్రధాన పాత్రలో నటించగా, శివకుమార్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్‌గా పాటినీకుమార్‌, రెండో హీరోయిన్‌గా గాయత్రి నటిస్తున్నారు. జాన్‌ విజయ్‌ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ టీవీ ఫేం జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఈశ్వరన్‌ తంగవేల్‌. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి చేతుల మీదుగా లాంచ్ అయింది. ఈ సినిమాను మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ సూరిశెట్టి, రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల, సురేష్ కొండేటి, డాక్టర్ గౌతం కశ్యప్, ఉమర్జీ అనురాధ పాల్గొన్నారు.
పోస్టర్ లాంచ్ అనంతరం నిర్మాత, సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ టెక్ డైవర్షన్ లోగో ఈ రోజు నా చేతులపై లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నిర్మాతలు ఈ టేక్ డైవర్షన్ సినిమాతో వేరే బిజినెస్ రంగంలో ఉన్నాకూడా టేక్ డైవర్షన్ తీసుకుని మొదటి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. వాళ్ళు సినిమా రంగంలో ఉంటూనే మరో డైవెర్షన్ లోకి వెళ్లకుండా ఇక్కడ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకట్, చందు, రామ్ గార్లు అందరు బ్రదర్స్ అందరు కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. కుటుంబంలో ముగ్గురికి సినిమా రంగం పై ఆసక్తి కలగడంల ఆనందంగా ఉంది. దీని వెనకుండి నడిపించిన రాజేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే దీనికి వెన్ను దన్నుగా ఉన్న మహిళా జర్నలిస్ట్ అనురాధ గారు సపోర్ట్ ఇవ్వడం.. ఆనందంగా ఉంది.. వీరందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. శివాని సెంథిల్ డైరెక్షన్ అందించారు. మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉన్న సినిమా. ట్రైలర్ చూసాను చాలా బాగుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్ అందుకుంటుంది. తెలుగు, తమిళ్ ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
ఉమర్జీ అనురాధ మాట్లాడుతూ .. టేక్ డైవర్షన్ పోస్టర్ విడుదల ద్వారా ప్యాషన్ తో వచ్చిన రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల గార్లకు అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమాను వారి కష్టార్జితంతో నిర్మిస్తున్నారు. చాలా తపన ఉన్న టీమ్ ద్వారా ఈ సినిమా రెడీ అయింది. ఓ చిన్న సినిమా ఇది. నిర్మాతలు చాలా కొత్తవాళ్లు. అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉన్న సినిమా. అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ టీం అందరికి అభినందనలు తెలుపుతున్నాను. తప్పకుండా ఈ టీమ్ అందరు పరిశ్రమలో నిలదొక్కుకుంటారు అన్నారు.
డాక్టర్ గౌతం కశ్యప్ మాట్లాడుతూ .. ఈ టైటిల్ చాలా బాగా నచ్చింది. అలాగే సెన్సిబుల్ నిర్మాతలు. మంచి ఉద్దేశం ఉన్నవాళ్లు, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్లు వీళ్ళు.. ఇలాంటి వాళ్ళు సినిమా రంగంలోకి రావడం చాలా మంచిది. అలాంటి వారు వస్తే మంచి సినెమాలు వస్తాయి. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను. డైరెక్టర్ కూడా చాలా సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. అలాగే ఇందులో మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉంది. తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది. ఈ సినిమా పోస్టర్ ని సురేష్ కొండేటి విడుదల చేయడంతో మన సినిమా ప్రేక్షకుల్లోకి స్పీడ్ గా వెళ్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు.
వెంకట్ మద్దాల మాట్లాడుతూ .. ఈ బ్యానర్ ని స్థాపించడానికి కారణం మంచి సినిమాలు చేయాలనీ, మొదటి ప్రయత్నంగా టేక్ డైవర్షన్ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారు, అనురాధ, గౌతమ్ ఇలా అందరికి థాంక్స్ చెబుతున్నాం. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు జోసెఫ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్నారు.
రామ్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మొదలెట్టి చేస్తున్న మొదటి సినిమా ఇది. తెలుగు, తమిళ్ భాషల్లో చేస్తున్నాం. శివాని సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకుంటుంది అన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. అలాగే సురేష్ కొండేటి గారు మాకు బ్యాక్ బోన్ గా నిలిచి సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే అనురాధ గారు, గౌతమ్ గారు ఇలా ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్నారు.
చందు మద్దాల మాట్లాడుతూ.. మేము ఇంతకు ముందు తమిళంలో ఓ చిన్న సినిమా చేసాం.. అది మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా చేస్తున్నాం. టేక్ డైవర్షన్ టైటిల్ తెలుగు తమిళ్ భాషల్లో ఒకటే టైటిల్ పెట్టాం. సినిమా విషయంలో బ్యాక్ బోన్ గా ఉండి అనురాధ గారు సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే సురేష్ కొండేటి గారు సపోర్ట్ అందిస్తున్నారు. తెలుగులో ఇకపై డైరెక్ట్ మూవీస్ మరిన్ని చేస్తాం. మాకు వేరే బిజినెస్ లు ఉన్నాయి.. కానీ కంటిన్యూ గా మారిన్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాం. వీళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ఎక్కువ సపోర్ట్ అందిస్తున్న సూరిశెట్టి రాజేష్. ఆయనకు థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

Related posts

Leave a Comment