సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ కు మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు సత్కారం

General News
Spread the love

విశాఖపట్నం: జర్నలిజంలో అడుగుపెట్టి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమసుందరరావును మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు అభినందించి సత్కరించారు.నెహ్రూ యువ కేంద్ర , శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ,రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్,ప్రకృతి చికిత్సాలయం సంయుక్త ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో నిర్వహించిన స్వామి వివేకానంద 159వ జయంతి,ఆజాదీ క అమృత్ మహోత్సవ్ సేవా కార్యక్రమాలకు గవర్నర్ హరిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం రాజీవగాంధీ మానవ సేవా జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోవిడ్ కష్టకాలంలో వైరస్ సోకిన బాధితులకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక సకాలంలో వైద్య సేవలందించిన వైద్యులకు, పోలీస్ శాఖ , పారిశుద్ధ్య పనివారలతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమసుందరరావులకు ముఖ్యఅతిథి మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబుచే దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.సత్కారం అందుకున్న వారిలో
ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్,విమ్స్ డైరెక్టర్ కే. రాంబాబు,విమ్స్ జనరల్ ఫిజీషియన్ ప్రొఫెసర్ సత్యప్రసాద్, ప్రకృతి చికిత్సాలయం నిర్వాహకులు డాక్టర్ ఎస్. లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి , ఇ ఎన్ టి విశ్రాంత సూపరింటెండెంట్ కృష్ణ కిషోర్, మహారాణి పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్
తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ మానవ సేవ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ తో పాటు నెహ్రూ యువ కేంద్ర యువ అధికారి మహేశ్వర రావు , నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ఏ రాంప్రసాద్ ,ఎస్. మహేష్, ఎస్. చాతుర్య, గేదెల శ్రీహరి , చొక్కాకుల రాంబాబు,సిహెచ్ రాజబాబు ,పల్లా చలపతిరావు, ఓ ఆల్బర్ట్ ,కే రామ్ కుమార్ , డాక్టర్ వై లక్ష్మణరావు , టీ గిరిజ ,వెంకట అప్పారావు ,నరేష్ , మోహన్ , మంగ, రమణ ,కొండమ్మ ,బంగారమ్మ ,శారద తదితరులు పాల్గొన్నారు .

Related posts

Leave a Comment