-తిరునగరి శ్రీనివాస్
బహుభాషల కూడలి
బహుముఖ ప్రజ్ఞకు ఆకృతి
భాషా వికాసానికి దోసిలి
రాజనీతికి రాజర్షి
పాములపర్తి సదసద్వివేక గిరిశిఖరి
తెలుగును వెలిగించిన ఋషి
జీవనకోణం భాషేనని విశ్వసించి
పాలన , బోధనకు మార్గంగా తీర్చిన శిరోమణి
సాంకేతిక భాషగా ఉన్నతిని తెలుగుకిచ్చి
విశ్వభాషల సరసన నిలిపిన ధీశాలి
మనీషి, సుమనస్వి, అక్షరయశస్వి
భాషాచైతన్యమే ఆయన పరితపన
వికాసశీలతే ఆయన ఆలోచన
అపర చాణుక్యుడు అతడు
సమున్నత వ్యక్తిత్వ తేజోనిధి
విశాలత్వం కలిగిన విజ్ఞుడైన ప్రధాని
సాహిత్య సహస్రఫణి, భాషాయోగి
వేయిపడగల అనువాదఝరి
సాటిలేని సృజనశీలి, క్రాంతదర్శి
పీవీ…మన తెలుగు ఠీవీ
స్వాభిమానతల ఘనాపాటి
(సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, హైదరాబాద్ పాత నగర కవుల వేదిక సంయుక్తంగా నిర్వహించిన
మాజీ ప్రధాని పీవీ. నరసింహ్మరావు శతజయంతి(1920-2021) కవితల పోటీలో బహుమతి పొందిన కవిత…)