సమంతకు బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చిన వీడీ11 మూవీ టీమ్!!

Vijay Deverakonda Surprise To Samantha
Spread the love

స్టార్ హీరోయిన్ సమంతకు మర్చిపోలేని విధంగా బర్త్ డే విశెస్ చెప్పింది వీడీ 11 మూవీ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగా సమంత బర్త్ డే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్లు టీమ్ అంతా నటించారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది.
కెమెరా రోల్ అవుతూ హీరో హీరోయిన్లు సీన్ చేస్తూ డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో హ్యాపీ బర్త్ డే సమంత అని విజయ్ చెప్పడంతో సమంత ఆశ్చర్యపోయింది. టీమ్ అంతా తన కోసం ఇలా అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలుసుకున్న సమంత ఎమోషనల్ అయ్యింది. షూట్ లో ఉన్న వెన్నెల కిషోర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, ఇతర టీమ్ మెంబర్స్ సామ్ తో కేక్ కట్ చేయించి బర్త్ డే విశెస్ తెలిపారు.

Related posts

Leave a Comment