మన యూనియన్ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేసి జిల్లా మహాసభలు నిర్వహించాలని కోరుతున్నాం. యూనియన్ పిలుపుపై స్పందించి ఇప్పటికే పలు జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి దశకు చేరుకుంది. కొన్ని జిల్లాలు సభ్యత్వాల జాబితాను కార్యాలయంలో సమర్పించి మహాసభలకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం సభ్యత్వాల సేకరణ, మహాసభల నిర్వహణ పట్ల జిల్లా శాఖల బాధ్యులు నిర్లక్ష్యం వహిస్తుండడం సరైంది కాదు. డిసెంబర్ చివరి కల్లా సభ్యత్వాల నమోదు, మహాసభలు పూర్తి చేయాలనే రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాన్ని ధిక్కరించడం విచారకరంగా భావిస్తున్నాం. ఏది ఏమైనా జనవరి మొదటి వారం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని జిల్లాల్లో రాష్ట్ర కార్యవర్గమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక తప్పదని సూచిస్తున్నాం.
-నగునూరి శేఖర్
(రాష్ట్ర అధ్యక్షులు)
కే.విరాహత్ అలీ
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
టీయుడబ్ల్యుజె