సంగీత దర్శకులు రాజ్ గారి మరణం తీరని లోటు : ఎడిటర్ మోహన్, నిర్మాత

సంగీత దర్శకులు రాజ్ గారి మరణం తీరని లోటు : ఎడిటర్ మోహన్, నిర్మాత
Spread the love

సంగీత దర్శకులు రాజ్ గారు ఇక లేరన్న వార్త తెలిసి ఎంతో వేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలనాటి సంగీత దర్శకులు శ్రీ టి.వి.రాజు గారి, తనయుడు గా, సంగీతంలో వారసుడుగా సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన రాజ్ మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. తన మిత్రుడు శ్రీ కోటి గారితో కలసి రాజ్ – కోటి ద్వయంగా మామగారు, బావ బావమరిది చిత్రాలకు చక్కటి సంగీతం అందించటమే కాక ఆ చిత్రాల విజయంలో శ్రీ రాజ్ గారి భాగస్వామ్యం ఉంది. రాజ్ గురువు గారు సంగీత దర్శకుడు చక్రవర్తి గారు స్వర పరచిన చిత్రాలకు నేను ఎడిటర్ గా భాద్యతలు నిర్వహించాను. నాటినుంచే రాజ్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాను. శ్రీ రాజ్ గారు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

Related posts

Leave a Comment