యంగ్ హీరో శ్రీవిష్ణు,బాణం
దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో చేయబోతున్న డిఫరెంట్ చిత్రానికి భళా తందనాన
అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీవిష్ణు ఇది వరకెప్పుడూ చేయని ఓ వైవిధ్యమైన పాత్రలో చూపించడానికి అద్భుతమైన స్క్రిప్ట్‌ను డైరెక్టర్ చైతన్య దంతులూరి సిద్ధం చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత, ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది. తగు భద్రతా చర్యలను తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి భళా తందనాన
చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీవిష్ణు జతగా క్యాథరిన్ ట్రెసా నటిస్తోంది. ఈమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. కె.జి.యఫ్ చిత్రంలో తనదైన విలనిజంతో ఆకట్టుకున్న రామచంద్రరాజు ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. సురేశ్ రుగుతు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా రైటర్. మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటర్. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
శ్రీవిష్ణు, కెథరిన్ ట్రెసా, రామచంద్రరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: చైతన్య దంతులూరి
నిర్మాత: రజినీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
బ్యానర్: వారాహి చలన చిత్రం
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్
సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు
ఆర్ట్: గాంధీ నడికుడికర్
రచన: శ్రీకాంత్ విస్సా
వారాహి టీమ్: భాను ప్రకాశ్, బాబీ చిగురుపాటి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్