శ్రీలంకలో మహ్మద్ రఫీకి ‘గ్లోబల్ ఐకాన్’ పురస్కారం

Mohammed Rafee Journalist
Spread the love

సీనియర్ పాత్రికేయులు, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ ని గ్లోబల్ ఐకాన్ పురస్కారం తో శ్రీలంక లో ఘనంగా సత్కరించారు. శ్రీలంక తెలుగు సంఘం, గ్లోబల్ ఫౌండేషన్, కర్ణాటక సంయుక్తంగా శుక్రవారం బెంటోట కొలొంబో లో 27వ అంతర్జాతీయ సాంస్కృతికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగం లో ఉండి సాంస్కృతిక వికాసానికి విశేష కృషి చేస్తున్న డాక్టర్ మహ్మద్ రఫీ ని ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఆహ్వానించి అంతర్జాతీయ పురస్కారం తో సన్మానించారు. శ్రీలంక, ఇండియా నుంచి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 12 మందిని సత్కరించినట్లు ఉత్సవ కమిటి చైర్మన్ మంజునాథ సాగర్ తెలిపారు. ఈ వేడుకలను రామకృష్ణ మఠం స్వామిజీ మహాదేవ ఉపాధ్యాయ జ్యోతి ప్రజ్వలనం చేసి లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ, శ్రీలంక శాస్త్రీయ జానపద సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం గా సాంస్కృతికోత్సవం వెల్లి విరిసింది. భారతీయ శ్రీలంక నృత్యాలు కనువిందు చేశాయి. ఈ వేడుకల్లో శ్రీలంక పర్యాటక శాఖ కమీషనర్ జార్జి ఫెర్నాండో, కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ హెగ్డే, శ్రీలంక మోడల్ రోజర్ రత్న, భారత, శ్రీలంక కు చెందిన కళాకారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment