వైభవంగా ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు : ప్రారంభించిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/11/School.tif
Spread the love

ఎంతో ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ లోని ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగాయి. ఈ ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో శనివారం విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు ప్రతీ ఒక్కరికీ మరపురాని అనుభూతని కలిగించాయి.
ఈ సందర్బంగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పలు నూతన సాంకేతికతను ఉపయోగించుకొని విజ్ఞాన విహారంలో తెలియాడాలని, ఈ విషయంలో ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ముందుండాలని కోరారు. మనదేశంలొ విద్యను అభ్యసించిన భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నత మైన స్థానాలో వున్నారన్న విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసారు. బ్రిటన్ ప్రధాని భారతీయులు కావడం దీనికి తార్కాణం అన్నారు. ఇది మనకెంతో గర్వకారణమన్నారు. ఉన్నత మైన ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దితూ 25 వసంతాలను పూర్తి చేసుకున్న \గీతాంజలి దేవ్ శాల’ను మంత్రి అభినందించారు. భవిష్యత్తులొ ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్బంగా సంస్థ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్నిఆయన ఘనంగా సన్మానించారు .మంచి పాఠశాల అయిన ‘గీతాంజలి దేవ్ శాల’లొ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు ఉండాలని ఆయన ఆశీర్వదించారు. అంగరంగ వైభవంగా ‘ఓపస్ అర్జెంటమ్’ అనే సార్ధక నామద్యేయంతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఇచ్చిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఇట్టే అలరించాయి. ఆనందడోలికల్లో ముంచెత్తాయి. చిన్నారులు నిర్వహించిన సంగీత విభావరి ఆద్యంతం అలరించింది. ఈ కార్యక్రమంలొ గీతాంజలి విద్యాసంస్థల పాలకవర్గం వ్యవస్థాపకురాలు గీత కరణ్, నిర్వహణాధికారి శ్రీజయ్ కరణ్, సహ వ్యవస్థాపకురాలు గీతాంజలి గ్రూవ్ ఆఫ్ స్కూల్, గీతాంజలి దేవ్ శాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి చంద్ర, గీతాంజలి దేవకుల్ సహ వ్యవస్థాపకురాలు నితాషా కరన్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ శ్రీనావల్ చంద్ర, మేనేజంగ్ డైరెక్టర్ జయ కరణ్ పాల్గొని రజతోత్సవ వేడుకలను ఆనందోత్సవాలతో అపురూపంగా తిలకించారు. తమ గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న తల్లితండ్రులు తమ చిన్నారుల ప్రతిభా పాటవాలను చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related posts

Leave a Comment