హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ కు చెందిన కీ.శే. మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ సాహెబ్ కుమారుడు, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా షేక్ మహమ్మద్ జహంగీర్ సాహెబ్ కుమారుడు షేక్ మహమ్మద్ అబ్దుల్ సుభాన్ (ఆమీర్)తో వైభవంగా జరిగింది. హైదరాబాద్ డబీర్ పురాలోని జామామజీద్ వజీర్ ఉన్నీసా లో ఆదివారం రాత్రి మార్చి 12న జరిగిన ఈ నిఖా అనంతరం అదేరోజు హైదరాబాద్ చంపాపేట్ లోని మంద నరసింహారెడ్డి గార్డెన్స్ లో జరిగిన విందుకు బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కలకాలం అన్యోన్యంగా దాంపత్య జీవితం కొనసాగించాలని నూతన జంటకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ నిఖాకు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మిత్రులు, చిన్ననాటి స్నేహితులు జలాల్ భాయ్, బిక్షపతి, గంప ఉపేందర్, సీనియర్ జర్నలిస్ట్, ‘నంది’అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మహమ్మద్ ఖలీల్ తదితరులు హాజరై అబ్దుల్ ఖాదర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ అతడి కుమార్తె-అల్లుడిని ఆశీర్వదించారు. హైదరాబాద్ కు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్న ఈ నిఖా కన్నులపండువగా, రమణీయంగా జరిగింది. నిఖాకు హాజరైన ప్రతీ ఒక్కరూ పసందైన విందును విందును ఆరగించి హాయిగా గడిపారు. నిఖా సందర్బంగా చక్కటి వంటకాలతో విందును ఏర్పాటు చేసిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ను వచ్చిన అతిథులు అభినందనలతో ముంచెత్తారు.
Related posts
-
WANTED TEACHERS FOR THE USA
Spread the love WANTED TEACHERS FOR THE USA -
అత్యంత వైభవంగా సౌధామినీ వివాహం
Spread the love దూడల శ్రీనివాస్ గంగాధర్ ప్రధమ పుత్రిక చి!!.ల!!సౌ!! సౌధామినీ వివాహం చి!! శివ కుమార్ (శ్రీ స్వామి గౌడ్... -
బాణా సంచా ధరల మోత : ధరలతో కళతప్పుతున పండగలు!
Spread the love by -షేక్ వహీద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ -9848787917 ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని...