వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ‘దిల్ వాలా’ ప్రారంభం

వీరభద్రం చౌదరి దర్శకత్వంలో 'దిల్ వాలా' ప్రారంభం
Spread the love

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం దిల్ వాలా. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. సినిమా లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్ ని అందించగా అలీ కెమరా స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. వివి వినాయక్ గారు సినిమాకి క్లాప్ కొట్టి ఆశీర్వాదించడం చాలా ఆనందంగా వుంది. అలాగే మా మొదటి సినిమా హీరో అల్లరి నరేష్ గారు ఇక్కడి వచ్చి బెస్ట్ విశేష్ అందించడం, అలీ గారు రావడం సంతోషంగా వుంది. మా నిర్మాతలు నబీషేక్, తూము నర్సింహా గారు ఈ చిత్రంతో డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ ని ప్రారంభించారు. నేను మొదలు పెట్టిన నిర్మాతలందరూ చాలా సక్సెస్ అయ్యారు. నబీషే గారు కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నేను కథ చెప్పగానే అంగీకరించిన నరేష్ అగస్త్యకి థాంక్స్. శ్వేత అవస్తి మంచి నటి. మెరిసే మెరిసే సినిమా చూసి శ్వేతని ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాను. నా చిత్రం పూలరంగడుకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా వుంది. డీవోపీ చేస్తున్న అనిత్ నాకు చాలా కాలంగా తెలుసు. అందరూ మంచి టెక్నిషియన్స్ ఈ చిత్రంలో పని చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోహిస్తున్నారు. గతంలో నరేష్ అగస్త్య, రాజేంద్రప్రసాద్ గారు సేనాపతి సినిమా చేశారు. అది నాకు చాలా నచ్చింది. అప్పుడే నరేష్ అగస్త్యకి కథ చెప్పడానికి వెళ్ళా. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెడతాం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు
నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. వీరభద్రం చౌదరి గారు కథ చెప్పిన తర్వాత మూడు రోజుల్లోనే సినిమా ఓకే చేశా. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీపడకుండా వందశాతం నా వర్క్ ని ఇస్తా. మొదటిసారి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నా. నాకు కూడా కొంచెం టెన్షన్ గా వుంది. (నవ్వుతూ). ఆడియన్స్ కి మరింత దగ్గరవ్వాలని వుంది” అన్నారు.
నిర్మాత నబిషేక్ మాట్లాడుతూ..వీరభద్రం చౌదరి దర్శకత్వంలో డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాతగా దిల్ వాలా సినిమాతో పరిచయం అవుతున్నా. ఇందులో నరేష్ అగస్త్య కథానాయకుడు. శ్వేత అవస్తి కథానాయిక. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మిస్తాను” అన్నారు.
శ్వేత అవస్తి మాట్లాడుతూ.. మంచి టీంతో కలసి పని చేస్తునందుకు చాలా ఆనందంగా వుంది. కథ, కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు థాంక్స్” తెలిపారు
అలీ రాజా మాట్లాడుతూ.. దిల్ వాలా అనే మంచి క్రైమ్ కామెడీతో మీ ముందుకు రాబోతున్నాం. నరేష్ నేను పదేళ్ళు తర్వాత కలసి పని చేయబోతున్నాం. 2013లో అన్నపూర్ణలో వీరభద్రం చౌదరి గారు షూటింగ్ లో వున్నప్పుడు ఒక అవకాశం కోసం అడిగేవాళ్ళం. ఎట్టకేలకు ఆయన సినిమాలో అవకాశం దొరికింది” అన్నారు.
క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్నఈ చిత్రంలో శ్వేత అవస్తి కథానాయికగా కనిపించనున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అలీ రాజా, దేవ్ గిల్, అలీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం క్లోసం వీరభద్రం చౌదరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాతలు.
మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
తారాగణం:
హీరో: నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి, రాజేంద్ర ప్రసాద్, అలీ రాజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష తదితరులు
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:వీరభద్రం చౌదరి
నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్
బ్యానర్స్ : డెక్కన్ డ్రీమ్ వర్క్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
మాటలు: శంకర్
కెమరా : అనిత్
ఆర్ట్ డైరెక్టర్ : ఉపేంద్ర
ఎడిటర్ : చోటా కె ప్రసాద్
కో డైరెక్టర్ : రమేష్ రెడ్డి పూనూరు
పీఆర్వో : వంశీ- శేఖర్

Related posts

Leave a Comment