‘విధిలిఖితం’ మోష‌న్ పోస్టర్ విడుదల

Spread the love

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌లో సోషియో ఫాంట‌సీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా నిర్మాత పాండు నిర్మాణంలో ఎమ్ లోచ‌న్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘విధిలిఖితం’. ఈ చిత్రంలో శ‌శాంక్ మంగు, భ‌వ్య‌శ్రీ హీరోహీరోయిన్స్‌గా చేస్తుండ‌గా అతి ముఖ్య‌మైన పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు సూర్య‌కుమార్ భ‌గ‌వాన్ దాస్ న‌టిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థ, కాన్సెప్ట్‌తో ఆధ్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం యొక్క మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ చూసిన వారంతా కొత్తగా ఫీల్ అవ‌టం చిత్ర యూనిట్‌కి చాలా ఆనందం క‌లిగించింది.

ఈ సంద‌ర్బంగా నిర్మా‌త పాండు మాట్లాడుతూ.. ‘‘రెగ్యుల‌ర్ చిత్రాలు తీస్తే చూసే ప‌రిస్థితి ఇప్ప‌డు లేదు. ఒక కొత్త పాయింట్‌తో సినిమా తీయ‌క‌పోతే ఈ కాంపిటేష‌న్‌లో వుండ‌టం క‌ష్టంగా వుంది. డైరెక్ట‌ర్ ఎమ్ లోచ‌న్ చెప్పిన క‌థ చాలా కొత్త‌గా వుంది. అలానే థ్రిల్లింగ్‌గా వుంది. సూర్యగారి పాత్ర చిత్రానికి కీ పాత్ర అవుతుంది. అలాగే ఈ చిత్రానికి వికాశ్ కురుమెళ్ళ సంగీతాన్ని అందిస్తున్నారు. ల‌క్ష్మి శ్రీనివాస్ కంతేటి, రామ‌కృష్ణ ప‌రిటాల మాట‌లు అందించారు. శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. మేము విడుద‌ల చేసిన ‘విధిలిఖితం’ మోష‌న్ పోస్ట‌ర్‌కి చాలా మంచి పేరు రావ‌టంతో యూనిట్ అంతా ఉత్సాహంగా వున్నారు..’’ అని అన్నారు.

న‌టీన‌టులు.. శ‌శాంక్ మంగు, భ‌వ్య‌శ్రీ, సూర్య‌కుమార్ భ‌గ‌వాన్‌దాస్ త‌దిత‌రులు..
బ్యాన‌ర్: శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత: పాండు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: ఎమ్ లొచ‌న్‌
సంగీతం: వికాశ్ కురుమెళ్ళ‌
సినిమాటోగ్ర‌ఫీ: నాగేంద్ర కుమార్ మోతుకూరి
ఫైట్ మాస్ట‌ర్‌: ష‌యోలిన్ మల్లేష్‌
మాట‌లు: ల‌క్ష్మి శ్రీనివాస్ కంతేటి, రామ‌కృష్ణ ప‌రిటాల
లిరిక్స్‌: రామాంజ‌నేయులు
కొరియోగ్రఫీ: చంద్ర‌కిర‌ణ్‌

Related posts

Leave a Comment