తన వ్యక్తిత్వాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తుంటారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. నిజాయితీగా వ్యవహరించడం, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయనకు అలవాటు. తానో స్టార్ ననే స్టేటస్ ఎప్పుడూ చూపించరు. ఆయన తన వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన లైగర్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండను ప్రశ్నలు అడిగేందుకు ఓ పాత్రికేయుడు ఇబ్బంది పడ్డాడు. మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఫ్రీగా ప్రశ్నలు అడగలేకపోతున్నా అన్నారు. దానికి విజయ్ స్పందిస్తూ…అదేం లేదు ఫ్రీగా అడగండి ఎలాంటి సందేహాలు వద్దు అంటు ముందున్న టేబుల్ మీద కాలు పెట్టి ఇలా దర్జాగా అడగండి నేను ఎంత ఎదిగినా మీ వాడినే అని చెప్పారు. దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ విజయ్ గ్రౌండెడ్ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులు అయ్యారు.
వాహ్.. విజయ్ దేవరకొండ!!
