పార్టీ మీటింగ్ లపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్య విషయంలో చూపించని ఆలేరు మున్సిపల్ చైర్మన్ : ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. ఎజాస్
పార్టీ మీటింగ్ లపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్య విషయంలో చూపించని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వశపరి శంకరయ్య మరియు ఆలేరు మున్సిపల్ పాలకవర్గం రాత్రి నుంచి నీటమునిగిన ఇండ్లలో నీరు చేరి ఆహారం వండుకోలేక వారు ఉదయం నుంచి దాదాపు 200 నుండి300ల కుటుంబాలు త్రాగడానికి మంచినీళ్లు లేక తినడానికి ఆహారం లేక పస్తులు ఉంటున్న ప్రజలను కనీసం భోజన సౌకర్యాలు ఐన ఏర్పాట్లు చేయని పాలకవర్గం తన సొంత పార్టీ మీటింగ్ కు హాజరై ప్రజల కన్నా ఎక్కువ పార్టీ మీటింగ్ అని ఈ ఆలేరు పాలకవర్గం వ్యవహరిస్తుంది తక్షణమే వచ్చి ప్రజలకు ఆహార సదుపాయలు చుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతీది ఈ యొక్క పాలకవర్గానికి గుర్తు చేస్తే తప్ప సొంతంగా వచ్చి పనులు చేసే సోయ్ లేకుండా పోయింది పార్టీ మీటింగ్ లో ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్య విషయంలో చూపించగలరు అని కోరుకుంటున్నాను అని ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. ఎజాస్ ఒక ప్రకటనలో తెలిపారు ఆలేరు పట్టణంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటే. ప్రజలు ఇళ్లల్లోకి వచ్చిన నీటిలో ఉండలేక వీధుల్లో తిరుగుతూ ఉంటే . కనీసం వారికి ఫ్లడ్ రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మరియు వారికి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా . పట్టణ ప్రధమ పౌరుడు అయినటువంటి ఆలేరు మున్సిపల్ చైర్మన్శం కరయ్య గారు ఈ పరిస్థితిలో పట్టణము వదిలిపెట్టి పార్టీ మీటింగ్ పేరుమీద పోవడము ఎంతవరకు సమంజసం? అసలు ఆలేరు మున్సిపాలిటీకి పాలకమండలి ఉన్నదా లేదా అన్న అనుమానం వస్తుంది. వరద నీటిలో చిక్కుకున్న ఆలేరు పట్టణాన్ని మరియు ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి కనీసం వారిని ఓదారుస్తారని ఆశిస్తున్నాను. పట్టణ ప్రజల బాధలను అర్థం చేసుకోని ఆలేరు మున్సిపల్ చైర్మన్ కు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి పట్టణ ప్రజల బాధలను ఒకసారి మీరు పర్యవేక్షించి తీరుస్తారని ఆశిస్తున్నాను అని ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. ఎజాస్ పేర్కొన్నారు.