లాక్ డౌన్ ఎత్తి వేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు

Spread the love

-వస్పరి శంకరయ్య, మున్సిపల్ చైర్మన్, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా


టాలీవుడ్ టైమ్స్- ఆలేరు


ఆలేరు పట్టణ ప్రజలకు నమస్కారం… లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులసంఖ్య,పాజిటీవ్ శాతం గణనీయంగా తగ్గిందని ,కరోనా పూర్తి నియంత్రణ లోకి వచ్చిందని,వైద్యశాఖ అధికారులు అందించిన నివేదిక లను పరిశీలించి ఈ మేరకు లక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తి వేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఈ సందర్భంగా ఆలేరు పట్టణ ప్రజలకు తెలియజేయునది ఎమనగా లాక్ డౌన్ ఎత్తి వేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని,తప్పని సరిగా మాస్కు దరించడం,భౌతిక దూరాన్ని పాటించడం,సాని టైజర్ ఉపయోగించడం తదితర,స్వీయ నియంత్రణ నియమావళిని విధిగా పాటించాలని,అందుకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కోరుతున్నాము.కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు ఆలేరు పట్టం ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నాము.మరియ ముఖ్యంగా ఆలేరు ప్రజలు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని,తడి,పొడి చెత్తను వేరు వేరు గా చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించగాలరని కోరుచున్నాము.
కరోనా మొన్నటి వరకు చాల కుటుంబాల్లో దుఃఖం నింపిన విషయాన్నీ మర్చిపోకుండా, జాగ్రత్తగా ఉండండి.

Related posts

Leave a Comment