అక్టోబర్ 19న రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో బాలల దసరా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి హైటెక్ సిటీలో ఉన్న ఫోనిక్స్ ఆర్ట్ గ్యాలరీ వేదిక కానుంది. అక్టోబర్ 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్న బాలబాలికలకు చిత్ర లేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ తో పాటు పాటల పోటీలను కూడా ఈ సంస్థ నిర్వహించనుంది. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. పోటీలో గెలిచిన విజేతలకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు మెమెంటో అందజేయడం జరుగుతుంది. ఆసక్తికల పేరేంట్స్ మీ పిల్లల పేర్లును ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం కె.మోహన్ (సెక్రటరీ ఆఫ్ రెయిన్ బో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ) ఫోన్ నెం – 8978251150 ను సంప్రదించగలరు.
రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో దసరా సంబరాలు
