న్యూఢిల్లీ : ఫిబ్రవరి 2022లో నిర్వహించిన రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్ రెండవ సీజన్ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ఇప్పుడు మరింతగా తమ కుటుంబాన్ని విస్తరించుకోవడానికి సిద్ధమైంది. భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్ధాపకులు ఇప్పుడు ఈ లీగ్‌లో మదుపరులుగా వచ్చి చేరారు. ఈ పీవీఎల్‌లో వారు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా 8వ ఫ్రాంచైజీ– ముంబై మీటార్స్‌ను సొంతం చేసుకున్నారు. పూర్వ భారత వాలీబాల్ టీమ్ కెప్టెన్ అభిజిత్ భట్టాచార్య నూతన ముంబై మీటార్స్ జీఎంగా చేరారు.
ఈ సందర్భంగా సమీర్ నిగమ్ మాట్లాడుతూ ‘‘ నా వరకూ తరచుగా వాలీబాల్ ఆడే ఆటగానిగా, ఈ క్రీడ ఎంత ఆనందాన్ని అందిస్తుందో నాకు తెలుసు. రూపే పీవీఎల్ మాకు ఖచ్చితమైన అవకాశాన్ని ఈ క్రీడను ప్రొఫెషనల్ మార్గంలో ప్రపంచశ్రేణి స్ధాయిలో నిర్మించే అవకాశం అందిస్తుంది. ఈ అవకాశం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాము’’ అని అన్నారు.
రాహూల్ చారి మాట్లాడుతూ ‘‘భారతీయ క్రీడా వ్యవస్థ అత్యంత ఉత్సాహపూరితమైన ప్రాంగణంగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా క్రికెటేతర రంగంలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో తగిన తోడ్పాటునందించేందుకు రూపే పీవీఎల్ మాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాము’’అని అన్నారు.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ 23 తొలి సీజన్‌ను భారతదేశపు సుప్రసిద్ధ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్ధ బేస్‌లైన్ వెంచర్స్, 24 గేమ్స్ ప్రత్యేకంగా కో–ప్రొమోట్ చేయడంతో పాటుగా ప్రత్యేకంగా మార్కెటింగ్ చేశాయి. ఈ లీగ్‌కు మొత్తంమ్మీద 133 మిలియన్‌ల టెలివిజన్ వ్యూయర్‌షిప్ ఉంది. ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలలో కామెంట్రీ ఎంచుకునే అవకాశమూ అందించింది.
అదనంగా, రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ భారతదేశ వ్యాప్తంగా 84 మిలియన్ల మంది అభిమానులను చేరుకుంది. దీనితో పాటుగా పలు డిజిటల్ మాధ్యమాల ద్వారా 5 మిలియన్ ఎంగేజ్‌మెంట్స్‌ను సైతం ఇది అందుకుంది. సమకాలీన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ద్వారా భారీ స్ధాయిలో ప్రాంతీయ అనుసంధానతనూ ఇది అందుకుంది. అదే సమయంలో గణనీయంగా వ్యూయర్‌షిప్‌ను మోజ్ ద్వారా అందుకుంది. మొత్తంమ్మీద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా 43 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ను సాధించింది.
రెండవ సీజన్ 2023 సంవత్సరారంభంలో ప్రారంభమవుతుందని అంచనా. వాలీబాల్ అంతర్జాతీయ సంస్ధ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ వాలీబాల్, ఎఫ్‌ఐవీబీ)కు వాణిజ్య విభాగం, వాలీబాల్ వరల్డ్ ఇప్పుడు పీవీఎల్‌తో చేతులు కలపడంతో పాటుగా పలు సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్ట్రీమింగ్ భాగస్వామిగా వ్యవహరించనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. రెండవ సీజన్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 లో అభిమానులు ఆసక్తికరమైన 31 గేమ్స్ వీక్షించవచ్చు.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ ‘‘సమీర్ మరియు రాహుల్‌లు ఫ్రాంచైజీ యజమానులుగా మా బోర్డ్‌పైకి చేరడం చాలా ఆనందంగా ఉంది. వీరి చేరికతో లీగ్ మరింత పెద్దగా,ఉత్తమంగా మారింది. అత్యంత గౌరవనీయమైన కార్పోరేట్ లీడర్లు ఈ క్రీడకు తగిన మద్దతు అందించడం మాత్రమే కాదు తీవ్రంగా కష్టపడి మరీ మేము రూపొందించిన వ్యాపార నమూనాకు కూడా వెన్నంటి ఉన్నారు. వారి అనుభవం ఈ లీగ్ మరింతగా మేము విస్తరించేందుకు తోడ్పడుతుందని, మరింత మంది ప్రేక్షకులను చేరుకుంటుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
ముంబై ఫ్రాంచైజీ యజమానులును స్వాగతించిన థామస్ ముత్తూట్, యజమాని, కొచి బ్లూ స్పైకర్స్ మాట్లాడుతూ ‘‘ శ్రీ నిగమ్ మరియు శ్రీ చారి లు ముంబై మీటార్స్‌టీమ్‌ను సొంతం చేసుకున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. వారి వ్యాపార అనుభవం, ఈ క్రీడ పట్ల అభిరుచి రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ కు చక్కగా తోడ్పడుతుందని భావిస్తున్నాము. ముంబై ఫ్రాంచైజీ ఇప్పుడు చేరడం వల్ల ఈ లీగ్ మరింతగా నూతన శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.