‘రుద్ర‌మాంబ‌పురం’ ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్‌పోస్ట‌ర్‌ విడుదల

rudramabhapuram telugu movie first look, motionan poster relesed by director maaruthi
rudramabhapuram telugu movie first look, motionan poster relesed by director maaruthi
Spread the love

శుభోద‌యం సుబ్బారావు, అజ‌య్ ఘోష్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం రుద్ర‌మాంబ‌పురం. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నందూరి రాము నిర్మిస్తున్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు. ఈ రోజు శుభోద‌యం సుబ్బారావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల‌చేసి టైటిల్ చాలా బాగుందని ప్ర‌శంసించి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ చిత్రంలో పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో శుభోద‌యం సుబ్బారావు న‌టిస్తున్నారు. వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌. వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
సాంకేతిక వ‌ర్గం: నిర్మాత‌: నందూరి రాము, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బంటు, బ్యాన‌ర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్, క‌థ‌: అజ‌య్ ఘోష్, డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి
సంగీతం: వెంగీ, ఎడిట‌ర్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రావు, ఆర్ట్‌: వెంక‌టేశ్వ‌ర రావు, ఫైట్స్‌: దేవ‌రాజు, కో- ప్రొడ్యూస‌ర్‌: డి న‌రసింహ‌మూర్తి రాజు, సీఈఓ: అన్నింగి రాజ‌శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కారెడ్ల బాలాజీ శ్రీ‌ను, పీఆర్ఓ: తేజ‌స్వి స‌జ్జ‌