యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలైన ీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి, నటుడు రవిబాబు, హీరోయిన్స్ మేఘా ఆకాశ్, సునైన, నైజాం, ఆంధ్ర, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘సినిమా అనుకున్నప్పుడు కుమార్ చౌదరిగారి దగ్గరకు వెళ్లాం. అలా పీపుల్ ఫ్యాక్టరీకి వెళ్లి వివేక్‌గారిని కలిశాం. తర్వాత అభిషేక్ అగర్వాల్‌గారిని కలిశాం. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత టీమ్‌కు చాలా ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. ఇలాంటి టీమ్‌తో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టం. రెండుసార్లు పాండమిక్ వచ్చినప్పుడు నిర్మాతలు ఎంతో సపోర్ట్ అందించారు. టీమ్‌లో అందరూ తమ సినిమా అనుకుని ఎంతో కష్టపడ్డారు. వేద సినిమాకు ఏది బెస్ట్ అవుతుందని అనుకున్నాడో దాన్ని ఇచ్చాడు. సినిమా చేసే సమయంలోనే డిఓపికి మంచి పేరు వస్తుందని అనుకున్నాం. మేం అనుకున్నది నిజమైంది. అలాగే విప్లవ్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ ఔట్‌పుట్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్‌ను ఎప్పుడు కలిసినా, సినిమా గురించి మాట్లాడినప్పుడు తనకు ఏం ఇవ్వాలో తెలుసు. దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాడు. ఇలా రాజరాజచోర సక్సెస్‌లో భాగమైన టెక్నీషియన్స్‌కు థాంక్స్. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్స్ సునైన, మేఘా ఆకాశ్ సినిమాను ఎంత వరకు నమ్మారో తెలియదు. కానీ.. నేను, హసిత్ అయితే హీరోయిన్స్‌కు చాలా మంచి పేరు వస్తుందని అనుకున్నాం. ఇద్దరు చాలా బాగా చేశారు. సినిమా సూపర్ హిట్ వచ్చింది. అందుకు హీరోయిన్స్‌కు థాంక్స్. ఇక రవిబాబుగారు, భరణిగారు, కాదంబరికిరణ్‌గారు, శ్రీకాంత్ అయ్యర్‌గారు ఇలా అందరూ చక్కటి సపోర్ట్ ఇచ్చారు. రవిబాబుగారు ఈ సినిమాకు హీరో అనాలి. హీరోయిన్స్, రవిబాబుగారు, గంగవ్వ, శ్రీకాంత్ అయ్యర్‌గారు ఏం చేశారో దానికి నేను రియాక్ట్ అయ్యానంతే. నేను చేసిందేమీ లేదు. వాళ్లని హీరోలుగా ఫీలయ్యే ఈ సినిమా మేం చేశాం. ఎందుకంటే పాత్రలు అలాంటివి మరి. సాధారణంగా ఓ సినిమాలో రెండు, మూడు పాత్రలు బావుంటాయి. కానీ.. సినిమాలో చేసిన ప్రతి పాత్ర అదిరిపోయింది. అలాంటి పాత్రలను క్రియేట్ చేసిన దర్శకుడు హసిత్ గ్రేట్. ఈ కథ ఇంత బాగా రావడానికి వివేక్ ఆత్రేయ ఓ మెంటర్‌లాగా ఉండి నడిపించాడు. కరోనా టైమ్‌లో తను చేస్తున్న సినిమాలకు సంబంధించిన కథలు రాసుకుంటూ, మాకు ఫోన్ చేసి మా కథ గురించి డిస్కస్ చేస్తూ మాకెంతో సపోర్ట్‌గా నిలిచాడు. తనకు స్పెషల్ థాంక్స్. సినిమా చేసిన తర్వాత రిలీజ్ అని ఓ వారం ముందు మాత్రమే అనుకున్నాం. అయితే మీడియా ఎంతగానో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాడు. చాలా రోజులు ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ప్రేక్షకుల ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. అలాగే ఈ సక్సెస్‌కు మాకు, ప్రేక్షకులకు వారధిలా నిలిచిన మీడియాకు స్పెషల్ థాంక్స్. శ్రీవిష్ణు, మేఘ, సునైన, రవిబాబుగారు సహా డైరెక్టర్ హసిత్ గోలి అండట్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ ‘‘‘రాజరాజచోర’ను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. హీరో శ్రీవిష్ణు, హీరోయిన్స్ సునైన, మేఘా ఆకాశ్, నటుడు రవిబాబు సహా అందరూ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు. అలాగే పాండమిక్ సమయంలోనూ సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్‌కు కూడా థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ ‘‘సినిమా ఎలాంటి పరిస్థితుల్లో విడుదలైందో అందరికీ తెలుసు. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్. మూవీ రిలీజ్‌కు ముందు మేం సినిమా చూశాం. మా టీమ్ అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. ప్రేక్షకులకు కూడా సినిమా బాగా నచ్చుతుందనుకున్నాం. కానీ ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు కొన్ని సిటీస్‌లోని థియేటర్స్‌కు వెళ్లి ప్రేక్షకులను పలకరించాం. అక్కడ ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే, సినిమా ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చింతో అర్థమైంది. ఇంకా స్క్రీన్స్ పెరుగుతున్నాయి. అందుకు సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌కు థాంక్స్. అలాగే ఈ జర్నీకి ప్రధాన కారణమైన విశ్వప్రసాద్‌గారు, అభిషేక్‌గారు, వివేక్‌గారు, కీర్తి చౌదరిగారికి థాంక్స్. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను నమ్మి.. రిస్క్ చేద్దామని, విడుదల చేయడం గొప్ప విషయం. వారి నమ్మకం ఈరోజు నిజమైనందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు.
హీరోయిన్ మేఘా ఆకాశ్ మాట్లాడుతూ ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్‌గారికి, అభిషేక్ అగర్వాల్‌గారికి, దర్శకుడు హసిత్ గోలిగారికి ధన్యవాదాలు. శ్రీవిష్ణు, సునైన, రవిబాబు సహా ఎంటైర్ టీమ్‌తో చేసిన జర్నీ మరచిపోలేను. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ సునైన మాట్లాడుతూ ‘‘తమిళంలో నేను చాలా సినిమాలు చేశాను. తెలుగులో కాస్త గ్యాప్ తర్వాత చేసిన రాజరాజచోర సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. శ్రీవిష్ణు, హసిత్, నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్, వివేక్‌గారికి థాంక్స్. నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు హసిత్‌కు స్పెషల్ థాంక్స్. అలాగే శ్రీవిష్ణు చాలా మంచి కోస్టార్. తను సెట్స్‌లో చాలా సపోర్ట్ చేశాడు. అలాగే మేఘా ఆకాశ్‌తో కలిసి పనిచేయడం కూడా నచ్చింది’’ అన్నారు.
నటుడు రవిబాబు మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమా చేయడానికి కారణం డైరెక్టర్ హసిత్. తను ఓ రోజు నాకు ఫోన్ చేసి కథ నెరేట్ చేయాలనుకుంటున్నాను.. కలుస్తానని అన్నాడు. నేను సరేనన్నాను. తను కాలు ఫ్రాక్చర్ అయినప్పటికీ ఇంటికి వచ్చాడు. కథ నెరేట్ చేసి వెళ్లిపోయాడు. తర్వాత నేను ఆలోచించాను. తను ఫోన్‌లోనే కథను చెప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడి వరకు వచ్చి వెళ్లాడంటే, నేను కచ్చితంగా ఈ రోల్ చేయాలని తను అనుకుంటున్నాడని అర్థమైంది. సరే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సాధారణంగా నన్ను చూసి అందరూ భయపడతారని అందరూ అంటుంటారు. కానీ.. ఈ సినిమా షూటింగ్‌కు వచ్చిన తర్వాత డైరెక్టర్‌ను చూసి నేను భయపడ్డాను. డబ్బింగ్ చెప్పడానికి వెళ్లినప్పుడు నాకు నేనే కొత్తగా అనిపించింది. ఓ కొత్త డైరెక్టర్ ఏ క్యారెక్టర్ ఎలా చేయాలో క్లారిటీతో ఉన్నాడంటే, తను మన తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడనిపించింది. గోలి అంటే హిందీలో బుల్లెట్. తను బుల్లెట్‌గా దూసుకెళ్తాడు. ఇది కన్‌ఫర్మ్’’ అన్నారు.
సక్సెస్‌మీట్‌లో భాగంగా చిత్ర యూనిట్‌కు, సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌ను షీల్డ్స్‌ను అందజేశారు.