కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక ఆయన త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు 23న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ కొన్ని ఎక్స్ క్లూజివ్ ఫోటోలు రిలీజ్ చేశారు. ఆ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ తో లారెన్స్ అదరగొడుతున్నారు. ఆయన లుక్ రజనీకాంత్ ను గుర్తు చేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
Related posts
-
ఈ సినిమాలో కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్ : ‘డియర్ కృష్ణ’ ప్రెస్ మీట్ లో నిర్మాత పి.ఎన్. బలరామ్
Spread the love పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా... -
ఆ డైరెక్టర్‌తో చిరంజీవి మెగా ప్రాజెక్టు!?
Spread the love ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన వశిష్టకు, తన సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేశారు చిరంజీవి. ఆ సినిమానే... -
వర్మ ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు
Spread the love ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో...