టాలీవుడ్‌పై ఫోకస్ తగ్గించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో పాగా వేశారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బీటౌన్‌లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో ‘యారియాన్’, ‘అయ్యారే’, ‘దేదే ప్యార్ దే’ వంటి మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ కూడా రకుల్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ మరో రెండు బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో ‘మే డే’లో రకుల్ హీరోయిన్‌గా నటించారు. అమితాబ్ బచ్చన్ ఇందులో కీలకపాత్ర పోషించారు. అదే విధంగా అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ ఈ మద్దుగుమ్మ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యువ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్ జీ’. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ డాక్టర్ ఉదయ్ పాత్రలో కనిపించనుండగా.. ఆయన సీనియర్‌గా రకుల్ డాక్టర్ ఫాతిమా పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాను అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో ”థ్యాంక్‌గాడ్, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్, మేడే, ఎటాక్” సినిమాలకు కమిటై బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ‘డాక్టర్ జీ’ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఏదేమైనా కోటిన్నర మేర రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా కూడా రకుల్‌కి వరుస ఆఫర్స్ దక్కుతున్నాయంటే ఈ ఏడాది అమ్మడి హవా ఓ రేంజ్‌లో ఉందో చూడండి. మొత్తం మీద రకుల్ ప్రీత్ సింగ్ ఇక టాలీవుడ్‌కు బై బై చెప్పేసినట్టే అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసినట్టే!
