మే 6న శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం ‘భళా తందనాన’ విడుదల

Sree Vishnu, Catherine Tresa, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana Releasing On May 6th
Spread the love

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది.
కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.
తారాగణం: శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం- చైతన్య దంతులూరి
నిర్మాత – రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
బ్యానర్: వారాహి చలనచిత్రం
సంగీతం – మణిశర్మ
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
డీవోపీ – సురేష్ రగుతు
స్టంట్స్: పీటర్ హెయిన్
ఆర్ట్ – గాంధీ నడికుడికార్
రచన – శ్రీకాంత్ విస్సా
పీఆర్వో: వంశీ-శేఖర్

Related posts

Leave a Comment