మెగాస్టార్ ‘భోళా శంకర్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది!

మెగాస్టార్ 'భోళా శంకర్' ట్రైలర్ డేట్ వచ్చేసింది!
Spread the love

తాజాగా టాలీవుడ్ నుంచి రానున్న భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మాస్ డ్రామా “భోళా శంకర్” కూడా ఒకటి కాగా తాను ఆల్రెడీ నటించిన రీసెంట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” తో మెగాస్టార్ ఈ ఏడాదిలో మొదటి హిట్ అందుకోగా ఇక రెండో చిత్రంగా అయితే ఇప్పుడు “భోళా శంకర్” తో మరో హిట్ ను అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదలకి దగ్గర పడుతుండగా ఓ పక్క పాటలు ప్లాప్ అవుతున్నాయి. ఈ గ్యాప్ లో అయితే ఈ చిత్రం ట్రైలర్ పై మేకర్స్ ఇప్పుడు క్రేజీ అప్డేట్ అందించారు. ఈ చిత్రం అవైటింగ్ ట్రైలర్ ని ఈ జూలై 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పేశారు. దీనితో పాటుగా మెగాస్టార్ పై విడుదల చేసిన పోస్టర్ కూడా అదిరే లెవెల్లో అనిపిస్తూ మెగా ఫ్యాన్స్ కి మంచి హుషారుని అందిస్తుంది. మరి వచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. కాగా ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఆమె ఈ చిత్రానికి సంబంధించి తన టోటల్ డబ్బింగ్ ని సైతం పూర్తి చేసింది. మరో హీరోయిన్ కీర్తి సురేష్ అయితే చిరుకి చెల్లి పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఆగస్ట్ 11న సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదీ.. విషయం.

Related posts

Leave a Comment