మున్సిపాలిటీల్లోనీ సమస్యలపై సిపిఐ ధర్నా

Spread the love

టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపాలిటీల్లోనీ సమస్యల పైన మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలపై మున్సిపాలిటీ కమిషనర్ లావణ్యలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ ఆలేరు పట్టణంలో పరిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని, మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని అన్నారు. డ్రైనేజీలు రిపేర్ చేసి పూర్తిగా క్లీన్ చేసి దోమల మందు పిచికారి చేయాలని కోరారు. పట్టణంలోని మౌలిక వసతుల యొక్క పనులు నిర్వహించడంలో పట్టణం పూర్తిగా దుర్గంధంగా మారిందని అన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందించాలని, అన్ని వార్డుల్లో అండర్ డ్రైనేజీ చేపట్టాలని, బీరప్ప గుడి వద్ద ప్లాట్లు మంజూరు చేసిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్వహించాలని, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి త్వరగా పూర్తిచేయాలని, అలాగే మున్సిపల్ పరిధిలో ఉన్న మడిగెలకు వేలం పాట వేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల మరోసారి ఉద్యమం చేస్తామని చెప్పారు. అలాగే మున్సిపాలిటీ కమిషనరు లావణ్య మాధవి మాట్లాడుతూ వారు కోరిన సమస్యల ను పై అధికారులతో మాట్లాడి త్వరలో పూర్తి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గొట్టి పాముల శ్రీనివాస్ రాజు, మండల కార్యదర్శి చౌడ బోయిన కనకయ్య, మండల సహాయ కార్యదర్శి తెడ్డు ఆంజనేయులు, దూడల లింగం, చౌడ బోయిన పరశురాములు. మహిళా సంఘం అధ్యక్షురాలు మాటూరి జానమ్మ, మహిళా నాయకులు యాదమ్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment