ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మా ఎన్నికలు రసవత్తరం అనుకున్న సమయంలో ఇప్పుడు మరో ఇద్దరు మహిళలు అధ్యక్ష బరిలో సిద్ధం అని ప్రకటించారు. ఇవాళ ఉదయం జీవిత రాజశేఖర్ ప్రకటించగా కాసేపటి క్రితం హేమ నేను సైతం అని ముందుకు వచ్చారు. కాగా, ఈ పోటీ రాజకీయంగా మారినట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ కర్ణాటక అయినప్పటికీ KCR మద్ధతు వున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి మద్ధతు కూడా ఆయనకే వున్నట్లు నాగబాబు ప్రకటన బట్టి అర్థం అవుతోంది. మంచు విష్ణు కు నట శేఖర కృష్ణ, బాలకృష్ణ, కృష్ణంరాజు మద్ధతు ఇచ్చినట్లు సమాచారం. జగన్ మద్ధతు తో పాటు BJP మద్ధతు తమకే అని మోహన్ బాబు చెప్పకనే చెప్పారు. ఈ నేపధ్యంలో జీవిత, హేమ వచ్చి చేరడం తో పోటీ ఇంకా రసవత్తరం కానున్నది. జీవిత తమిళనాడు అని, తాను పక్కా లోకల్, సీనియర్ అని హేమ చెబుతోంది.
మా బరిలో హేమ
