మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ సూటి ప్రశ్న
సింగరేణి కానీకి చెందిన ఒక గిరిజన చిన్న పసి పాప ఐదు సంవత్సరాల పాప కిరాణా కొట్టుకు తల్లి ఇచ్చిన ఐదు రూపాయలతో కొనుక్కోడానికి వెళ్ళిన పాపను ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న దుర్మార్గుడు ఆ పాపను అపహరించి మానభంగం చేసి చంపేయడం జరిగింది.ఈ సంఘటన యావత్ ప్రపంచానికి గుండెలు పిండేసే విధంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ఎవరు కూడా స్పందించలేదు ఈ రోజున తల్లిదండ్రులు నడిరోడ్డు మీద కన్నీళ్లతో వాళ్ళు రోడ్డుపై బైఠాయించడం జరిగింది వాళ్ళతో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోదు నా పాపను నాకు తెచ్చి ఇవ్వండి అని బోరునా ఏడుస్తున్న వాళ్లను చూసి ప్రతి ఒక్కరు కన్నీటి పరమైనరు. నిందితుడే పోలీస్స్టేషన్లో లొంగిపోతే తనకు కాపలాగా, రక్షణగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. మన తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు నీకు ఇలాంటి దుర్ఘటనలు ఏవి కళ్ళకు కనబడట్లేద అని అడుగుతున్నాము.మీ పోలీస్ యంత్రాంగానికి కేవలం మీ రాష్ట్ర మంత్రులకు కేసీఆర్ కుటుంబానికి రక్షణగా ఉంచుకుంటున్నారు ఈ పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఎందుకు మీరు దయ చూపుట లేరో కూడా ఈ ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాము పాలు తాగే పసిపిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు ఈ అత్యాచారాలకు గురి అవుతుంటే ఏ ఒక్క నిందితుడిని వెంటనే మీరు ఎందుకు దిశ చట్టాన్ని అవలంబించి వెంటనే ఉరి తీయడం లేదని మేము అడుగుతున్నాము. తెలంగాణ తెచ్చుకున్నది బంగారు తెలంగాణ అని అనుకున్నాము కాని పసిపిల్లలు, యువతుల జీవితాలు కామాంధుల చేతిలో ఇలా బలైపోతున్న ఎవరూ కూడా ఎప్పుడూ కూడా అనుకోని విధంగా మీ పరిపాలన ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎక్కడైతే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో అక్కడ వరాల జల్లు కురిపిస్తు ప్రజలను మోసం చేస్తున్నది ఈ రాష్ట్రప్రభుత్వం. ఎక్కడైతే దళిత గిరిజన బిడ్డలు బలైపోతున్నారో ఆ ఇంటికి సంబంధించి ఒక డబల్ బెడ్ రూమ్,మూడు ఎకరాల పొలం, డబ్బు ఆశ చూపి ఆ కుటుంబాన్ని నోరు మూయూస్తూ రాష్ట్రప్రభుత్వం కొనసాగిస్తారా అని ప్రశ్నిస్తున్నాం. పన్నెండు వందల మంది బలిదానాల త్యాగమే తెలంగాణ అయితే ఆడవాళ్ళ పైన ఇలాంటి రక్షణ లేని విధంగా వ్యవహరించడం ఆ బిడ్డల బలిదాన కి అర్థం లేని పరమార్థంగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మా మహిళల తరఫున ఒక హెచ్చరిక మీ పోలీసులను నిరంతరం మీ కాపలా కాకుండా పేద ప్రజల కోసం కూడా పని చేయడానికి వాళ్లకు స్వేచ్ఛను అడుగుతున్నo.పోలీస్ వ్యవస్థ ఈ రోజు నిందితులకు కాపలా, అటు మీ రాష్ట్ర మంత్రివర్యులకు మీ నాయకులకు కాపల, పేద ప్రజలను పట్టించుకునేది ఎవరు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేతనైతే సమ పరిపాలన చేయండి లేదా రాజీనామా చేయండి.