‘మల్లేశం’ నిర్మాతల మరో సినిమా

the producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood. Paka is a Malayalam language feature film directed by Nithin Lukose, who was the sound designer for Mallesham.
Spread the love

గతంలో మల్లేశం లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు ఇప్పుడు కొత్తగా మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ​పక-రివర్ ఆఫ్ బ్లడ్ అనే ఈ కొత్త సినిమా మలయాళం సినిమాగా రూపొందించబడింది. మల్లేశం సినిమాకి సౌండ్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ లూకోస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఒక నిర్మాత కావడం మరొక విశేషం. ఎన్నో ఏళ్లగా రెండు కుటుంబాల మధ్య రగులుతున్న పగ, ద్వేషాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక నది ప్రముఖ పాత్రపోషిస్తుంది. వారి పగకు ఎరుపెక్కిన ఆ నదిని శాంతింపచేసే ప్రేమ కథగా కూడా ఈ సినిమాని చూడొచ్చని దర్శక నిర్మాతలు తెలియచేశారు.
ఉత్తర కేరళలోని వయానాడ్ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడిన ఈ సినిమాలో బాసిల్ పాలోస్, వినీత కోషీ., జోష్ కిళక్కన్, అతుల్ జాన్ ప్రధాన పాత్రలు పోషించగా, సినిమాటోగ్రాఫర్ గా శ్రీకాంత్ కబోతు, సంగీత దర్శకుడిగా ఫైజల్ ఎహ్మద్, ఎడిటర్ గా అరుణిమ శంకర్ మరియు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వెంకట్ శిద్దారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఈ చిత్రం ఎన్‌ఎఫ్‌డిసి ఫిల్మ్ బజార్ 2020 లో వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ లో ఉత్తమ ప్రాజెక్ట్ గా గెలుపొందింది. స్టూడియో 99, ఆలిఫ్ టాకీస్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా దర్శకుడు‌ నితిన్ లూకోస్ కి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరగనున్న ప్రతిష్టాత్మక టొరాంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న రెండు భారతీయ చలనచిత్రాల్లో పక-రివర్ బ్లడ్ ఒకటి కావడం, ఆ సినిమాకి నిర్మాతలు మన తెలుగు వారు కావడం మన గర్వకారణం

Related posts

Leave a Comment