భోళా శంక‌ర్‌లాంటి మ‌న‌సున్న సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవికి రాఖీ క‌ట్టిన కీర్తిసురేశ్‌

keerthy Suresh Ties Rakhi To His Bholaa Shankar Brother Megastar Chiranjeevi
Spread the love

ఆదివారం(ఆగ‌స్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు అలాగే ర‌క్షా బంధ‌న్ కూడా. ఈ సంద‌ర్భంగా చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం భోళా శంక‌ర్‌ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. అలాగే నేష‌న‌ల్ రేంజ్‌లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
భోళా శంక‌ర్‌ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. సినిమా కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నుంది. ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ క‌ట్టి
చెల్లెలంద‌రీ ర‌క్షాబంధం... అభిమానులంద‌రి ఆత్మ బంధం... మ‌న అంద‌రి అన్న‌య్య జ‌న్మ‌దినం.. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య‌... అంటూ ఆయ‌న‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ఈ చిత్రంలో అన్నాచెల్లెల మ‌ధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ ..అన్నా చెల్లెలుగా ఆక‌ట్టుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో మ‌న‌కు చాలా కాలం గుర్తుండిపోతుంది. అలాగే సినిమాలో వీరి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేస్తుంది
భోళా శంక‌ర్‌లో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర‌కు కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకోవ‌డమే కాదు, ర‌క్షా బంధ‌న్ రోజున ఈ సినిమాను అనౌన్స్‌మెంట్‌ను చేయ‌డ‌మ‌నేది క‌రెక్ట్ ఛాయిస్‌.
ఈ ప‌విత్ర‌మైన రోజున మెగాస్టార్ చిరంజీవిగారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం ఆనందంగా ఉంది. మీతో క‌లిసి న‌టించ‌డ‌మ‌నేది నా క‌ల‌. ఈ అద్భుత‌మైన ప్ర‌యాణం ఎప్పుడు ఎదురువుతుందా! అని ఎదురుచూడ‌లేక‌పోతున్నాను. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య‌ అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేస్తూ కీర్తి సురేశ్ వీడియోను విడుద‌ల చేసింది.
ర‌క్షా బంధ‌న్ రోజున విడుద‌లైన ఈ వీడియోకు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌హ‌తి సాగ‌ర్ ఆహ్లాద‌క‌ర‌మైన‌ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను చాలా స్టైలిష్‌గా తెర‌కెక్కిస్తాడ‌నే పేరున్న డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్.. ఈ భోళా శంక‌ర్‌ సినిమాను ప్యామిలీ ఎమోష‌న్స్‌తో స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది.
చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో ..అనీల్ సుంక‌ర త‌న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అసోషియేష‌న్‌తో నిర్మిస్తోన్న భోళా శంక‌ర్‌ మూవీ.షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ మోష‌న్ పోస్ట‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. యూట్యూబ్‌లో ఈ వీడియోట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఈ స్పెష‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లాయి.
న‌టీన‌టులు:
చిరంజీవి, కీర్తి సురేశ్‌
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: మెహ‌ర్ ర‌మేశ్‌
నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Related posts

Leave a Comment