మణి సాయితేజ, హాసిని రాయ్ జంటగా మాక్‌ఉడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎ.రాబిన్ నాయుడు దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్యాట్ లవర్స్’. ఈ సినిమాను టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. సి.కళ్యాణ్ మాట్లాడుతూ “క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘బ్యాట్ లవర్స్’. అందరూ కొత్తవాళ్లతోనే సినిమాను రూపొందించారు. నిర్మాత ఉపేందర్ తన కొడుకు మణిసాయిని హీరోగా పరిచయం చేస్తూ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ రాబిన్‌కు సినిమా మంచి పేరు తేవాలి. అలాగే మణిసాయి హీరోగా సక్సెస్ కావాలి. టీజర్ చాలా బావుంది. కేవలం క్రికెట్ అనే కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌ను కూడా మిక్స్ చేసి చేశారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న హాసిని రాయ్ మంచి పేరు తెచ్చుకోవాలి. క్రికెట్ అనేది ఎంత పాపులారో ‘బ్యాట్‌లవర్’ కూడా అంతే ఫేమస్ కావాలి. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అన్నారు.
నిర్మాత ఉపేందర్ మాట్లాడుతూ “మా ‘బ్యాట్ లవర్స్’ టీజర్‌ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్‌గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాతో మా అబ్బాయి మణి సాయితేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్ రాబిన్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ సినిమాను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అందరూ మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
డైరెక్టర్ ఎ.రాబిన్ నాయుడు మాట్లాడుతూ “‘బ్యాట్ లవర్స్’ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత ఉపేందర్‌గారికి థాంక్స్. అలాగే టీజర్ విడుదల చేసి మా యూనిట్‌ను ఎంకరేజ్ చేసిన కళ్యాణ్‌గారికి స్పెషల్ థాంక్స్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో మణి సాయితేజ మాట్లాడుతూ “మా ‘బ్యాట్ లవర్స్’ సినిమా టీజర్‌ను విడుదల చేసిన కళ్యాణ్‌గారికి స్పెషల్ థాంక్స్. అందరూ కొత్తవాళ్లతో చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ హాసిని రాయ్, మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్, సినిమాటోగ్రాఫర్ సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్ హాసిని రాయ్ మాట్లాడుతూ “హీరోయిన్‌గా తొలి చిత్రమిది. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. ఉపేందర్‌గారు సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ రాబిన్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. మా టీమ్‌ను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.
నటీనటులు:
మణి సాయితేజ, హాసిని రాయ్, చలాకీ చంటి, గోవింద రాజ్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: దీక్షిక
బ్యానర్: మాక్ ఉడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన, దర్శకత్వం: ఎ.రాబిన్ నాయుడు
నిర్మాత: కొడ్రాసి ఉపేందర్
మ్యూజిక్: డేవిడ్
సినిమాటోగ్రపీ: సంతోశ్
ఎడిటర్: సాయి కుమార్
కొరియోగ్రఫీ: కపిల్ మాస్టర్
సింగర్స్: రాహుల్ సిప్లిగంజ్, హేమ సుందర్, దీపు