జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘విక్రమ్’ మూవీలో కమల్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన లెక్కలు చూస్తుంటే బాప్ రే.. అనిపిస్తోంది. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ తాజాగా రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విక్రమ్ దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో ఉంది. 167 మిలియన్ డాలర్లతో టాప్ గన్ మావెరిక్ మొదటి స్థానంలో, 55 మిలియన్ డార్లతో జురాసిక్ వరల్డ్ డొమీనియన్‌రెండో స్థానంలో నిలవగా 21 మిలియన్ డాలర్లతో విక్రమ్ మూడో స్థానంతో పాగా వేసింది. అయితే.. ఈ సినిమాపై ఎందరో స్టార్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ రాజనీకాంత్ తన ప్రశంసలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో విజయ్ తన అభినందనలు ప్రకటించారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జూన్ 3న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే తమిళనాడులో కేవలం 3 రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కు దాటేసి..అభిమానుల్లో జోష్ నింపుతోంది. కమల్ సక్సెస్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రంపై స్టార్ హీరో విజయ్ ప్రశంసలు కురిపించాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విక్రమ్ సినిమా చూసిన విజయ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడట. అంతేకాదు విక్రమ్ సినిమా కోసం కష్డపడిన టీం మెంబర్స్ పై ప్రశంసలు కురిపించాడు. విజయ్-లోకేశ్ కాంబోలో మాస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తన అభిమాన హీరో కమల్‌హాసన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన తీరుకు మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. మరోవైపు విక్రమ్ కేవలం 2 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దశావతారం, విశ్వరూపం సినిమాల తర్వాత ఈ అరుదైన ఫీట్ సాధించిన చిత్రమిదే కావడం విశేషం.ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ‘విక్రమ్’ కలెక్షన్ల హవా కొనసాగుతోంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్కాం బోలో వచ్చిన చిత్రం విక్రమ్ . జూన్ 3న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదలైన విక్రమ్ బాక్సాపీస్ వద్ద తన స్టామినా చూపిస్తోంది. ఇప్పటికే 2 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది విక్రమ్. తాజా కలెక్షన్లపై ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ రూ.2 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఓ తమిళ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు శుభపరిణామనే చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఈ చిత్రం కేవలం 3 రోజుల్లో రూ.50 కోట్ల మార్కు దాటి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరి వీక్ డేస్‌లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందనేది చూడాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో విక్రమ్ ఏ రేంజ్‌లో వసూళ్లు చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న’విక్రమ్’
