అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించి తాజా మల్టీస్టారర్ చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి పండగకు మనముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్లింది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’కు బాగానే కలిసొచ్చింది. ఇక ఆరేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూనే ఉన్నాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటి నాలుగు రోజులు జోరు చూపించిన ఈ సినిమా ఐదో రోజు నుంచి కలెక్షన్స్ పడిపోయాయి. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ‘బంగార్రాజు’ మూవీ రూ. 12 లక్షల షేర్ రాబట్టి ఓకే అనిపించింది. కానీ 20వ రోజు రెండు లక్షలు డ్రాప్ అయి రూ. 10 లక్షలు మాత్రమే వసూలుచేసింది. ఈ సినిమా ఏపీలో మాత్రం మంచి వసూళ్లను రాబడుతూ అక్కడ సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది. తెలంగాణలో మాత్రం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. తెలంగాణలో ‘బంగార్రాజు’ మేనియా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా 20 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టింది. టోటల్‌గా బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందన్న విషయాల్ని ఓ సారి చూద్దాం…
నైజాం(తెలంగాణ) : రూ. 8.30 కోట్లు / రూ. 11 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 6.85 కోట్లు / రూ. 6 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 5.21 కోట్లు / రూ. 4.05 కోట్లు
ఈస్ట్:రూ 4.14 కోట్లు / రూ. 2.8 కోట్లు
వెస్ట్: రూ. 2. 90 కోట్లు / రూ. 2.6 కోట్లు
గుంటూరు:రూ. 3.44 కోట్లు / రూ. 3.20 కోట్లు
కృష్ణా: 2.25 కోట్లు / రూ. 2.70 కోట్లు
నెల్లూరు: రూ.1.75 కోట్లు / 1.45 కోట్లు
తెలంగాణ + ఏపీ : రూ. 34.84 కోట్లు షేర్ ( 56.63 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు..
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.1.79 కోట్లు / రూ. 2.15 కోట్లు..
ఓవర్సీస్ : రూ. 1.49 కోట్లు.. / రూ. 2.20 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ 13 రోజుల కలెక్షన్స్ : రూ.38.12 కోట్లు షేర్ (రూ. 63.87 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 38.87 కోట్లు వసూళ్లు..
మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ. 88 లక్షల షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. ఈ సినిమా ఏపీలో తక్కువ రేట్స్‌కు అమ్మడంతో లాభాల్లోకి వచ్చింది. 100 శాతం ఆక్యుపెన్షీ ఉన్న నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది. ఇక ఏపీలో కృష్ణాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో ‘బంగార్రాజు’కు ఆశించినంత రెస్పాన్స్ దక్కలేదనే చెప్పాలి అదీ..విషయం!!