- -ఫోటో స్టూడియో షాపులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి
- -ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు తునికి దశరథ
- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు తునికి దశరథ హాజరై మాట్లాడుతూ కెసిఆర్ ప్రకటించిన నాయి బ్రాహ్మణులకు, మరియు రజకుల షాపులకు ఉచితంగా కరెంటు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కావున మా ఫోటోగ్రాఫర్లకు రెండు సంవత్సరాల నుండి కరోనా సమయంలో పెళ్లిళ్లు, ఏ శుభకార్యాలు లేనందున కిరాయిలు, కరెంటు బిల్లులు, చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని , అప్పు చేసి లక్షలు పెట్టి కెమెరాలు తెస్తే శుభకార్యాలు లేక అప్పు చెల్లించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కాబట్టి ఈ ప్రభుత్వము మా ఫోటోగ్రాఫర్ లను దృష్టిలో పెట్టుకొని మా ఫోటో స్టూడియో షాపులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు ఆకుపత్తిని ప్రభాకర్, కాసు బాధ హరిబాబు, శనిగరం శ్రీనివాస్, గుండు మధుసూదన్, రాయపురం నరసింహులు, రాయపురం శేఖర్, వెంగళదాస్ హరిబాబు, సీసా రాజేష్, గణపురం శివ, కోలా నరేష్, రాయపురం శ్రీనివాస్, గంజి వెంకటేష్, భాస్కర్, వేణు, తదితరులు పాల్గొన్నారు.