ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ కు సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సత్కారం

sirisaala abdul
Spread the love

50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎం.డి.అబ్దుల్ ఎన్నికయ్యారు. గతంలో ఈ అసోసియేషన్ లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్బంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఎం.డి.అబ్దుల్ ను హైదరాబాద్ లో తమ సంస్థ కార్యాలయంలో సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత సిరిసాల యాదగిరి ఘనంగా సత్కరించారు.
ఈ సంద‌ర్భంగా సిరిసాల యాదగిరి మాట్లాడుతూ… ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇది 50 సంవ‌త్స‌రాల చ‌రిత్ర గ‌ల అసోసియేష‌న్. నిజ‌మైన ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు అనేది ప్రారంభ‌మైంది ఈ సంస్థ ద్వారానే. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. సినిమా రంగానికి 24 క్రాఫ్టులు ఉంటే.. సినిమా జ‌ర్న‌లిస్టులు అనేది 25 క్రాఫ్టు అవ్వాల‌ని కోరుకుంటున్నాను. 50 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఈ అసోసియేష‌న్ ఫ‌స్ట్ టైమ్ మెంబ‌ర్స్ అంద‌రికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయ‌డం అభినందించతగ్గ విషయం. అలాగే మెంబ‌ర్స్ ఎవ‌రైనా చ‌నిపోతే 25,000 ఇవ్వ‌డం ఎంతో మంచి పరిణామం. సినిమా జ‌ర్న‌లిస్టుల అసోసియేష‌న్లో కీల‌క‌మైంది ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ మాత్రమే అని నేను ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌లుతాను అన్నారు. 50 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ 2022 – 2024 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి జ‌రిగిన ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా జ‌ర‌గ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. ఇటు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, అటు అసోసియేష‌న్ మెంబ‌ర్స్ కి మేలు జ‌రిగేట్టు ఈ కొత్త కార్య‌వ‌ర్గం ముందుకు అడుగు వేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఇండ‌స్ట్రీలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అనేది చాలా ముఖ్య‌మైన‌ది. సినిమా ప‌త్రిక‌లు నంబ‌ర్ వ‌న్ కానీ.. సితార కానీ.. సూప‌ర్ హిట్ కానీ.. అలాగే సంతోషం కానీ.. ఇలా సినిమా ప‌త్రిక‌ల్లో వార్త‌లు, ఫోటోలు రావ‌డం వ‌ల‌నే అప్ప‌ట్లో సినిమాల గురించి సామాన్య జ‌నాల‌కు తెలిసేవి. అలాగే ఎంతో మంది సినీస్టార్స్ అవ్వడంలో సినీ జ‌ర్న‌లిస్టులు ముఖ్య‌పాత్ర పోషించారు అన‌డంలో సందేహం లేదు. సుధీర్ఘ చ‌రిత్ర గ‌ల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ఎన్నో బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తుంది. అబ్దుల్ ను జాయింట్ సెక్ర‌ట‌రీగా ఎన్నుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను. సంస్థ చేసే ప్ర‌తి కార్య‌క్ర‌మంలో తోడుగా ఉంటూ సంస్థ అభివృద్దికి ఎంత‌గానో పాటుపడాలని ఆయన కోరారు.
ఈ సందర్బంగా జరిగిన సత్కార కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోశాధికారి ఏ. రాజేష్ యాదవ్ , సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సభ్యులు పి. రవికుమార్, ఎస్. సాయినాథ్, ఆర్. జనార్దన్, ఎం. దివాకర్, బి. రవికుమార్, జర్నలిస్ట్ జగదీష్ సాగర్, దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి, రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment