‘ ప్రేమ సేవా సదనం’ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ

aler news
Spread the love
  • -తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
  • వాయనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క
  • పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ అని ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మలో వాయనాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా మాట్లాడారు. పూలను పూజించి ఆరాధించే తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తీరు తీరు పువ్వులతో పేర్చే బతుకమ్మ విశిష్టతను నిరంతరంగా చాటి చెప్పడానికి బహుజన బతుకమ్మ కార్యక్రమం చేపట్టామని అన్నారు.అక్టోబర్ 6 న ఉస్మానియా ప్రాంగణంలో ప్రారంభమైన బహుజన బతుకమ్మ 9 రోజులు,9 జిల్లాలలో జరిగి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చేరుకుందని అన్నారు.బహుజన బతుకమ్మ కార్యక్రమం గత పదేళ్లుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పంచభూతాలను అమ్ముకునే బహుళజాతి కంపెనీలను నిరసించి,పంచభూతాలను నమ్ముకుని జీవిస్తున్న బహజనులకు అండగా ఉందామని సూచించారు. బహుజన బతుకమ్మ ఉత్సవం మాత్రమే కాదని ఒక ఉద్యమమని చాటాలని పిలుపునిచ్చారు.ప్రకృతి వ్యవసాయాన్ని ప్రేరేపించి ప్రకృతి బతుకమ్మ కు ఊపిరి పోసి అప్పుల భారంతో రైతుల జలవన్మరణాలను ఆపడానికి ప్రయత్నం చేయాలని అన్నారు.నేడు రైతు సేద్యం లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల విచ్చలవిడి వినియోగం వల్ల అనారోగ్యం పట్టి పీడిస్తుందని పెట్టుబడి భారం లేని ప్రకృతి వ్యవసాయాన్ని, సురక్షితమైన పంటను, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే సాగుభూమిని రైతులు కోరుకోవడం సరైన ఉద్యమక్రమంగా బహుజన బతుకమ్మ భావిస్తోందని చెప్పారు.సురక్షితమైన దేశీయ విధానాలే భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కాగలదని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని బహుజన బతుకమ్మ కోరుకుంటుదని. పంటల నూర్పిడితో మొదలైన పండుగలను, సురక్షిత వంటలలోనే జరపాలని భావిస్తుందని అన్నారు. దేశీయ విత్తనాలతో, దేశీయ పద్ధతులతో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలంటే ఏడాది పొడవునా ఉద్యమంగా సాగించడానికి, కార్పోరేటీకరణకు అడ్డుకట్ట వేయడానికి బహుజన బతుకమ్మ అడుగులేస్తుందని వ్యవసాయిక సంక్షోభం నుండి తమను తాము కాపాడుకోవడానికి పదినెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతాంగానికి, పోడు భూములకు పట్టాలకై ఉద్యమిస్తున్న ఆదివాసులకు, నిరుపేదలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పారు.. సార్వభౌమిక వ్యవసాయమే లక్ష్యంగా భావసారూప్యత కలిగిన శక్తులందరితోనూ బహుజన బతుకమ్మ కలిసి నడుస్తుందని అన్నారు. ప్రేమ సేవాసదనం ఫౌండర్ ఆకవరం మోహనరావు, డైరెక్టర్ మహమ్మద్ కుర్షీద్ పాషా, కౌన్సిలర్ గుత్త శమంతారెడ్డి, డానియేల్ తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment