ప్రేక్షకులకు కామెడీ థ్రిల్లింత ఇవ్వనున్న కాజల్ అగర్వాల్… ఉగాదికి థియేటర్లలో ‘కోస్టి’ విడుదల

Kajal Aggarwal to give the audience a comedy with a thrill... 'Kosti' is going to be released in Ugadi theaters*
Spread the love

అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘కోస్టి’. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా ‘గులేబకావళి’, జ్యోతిక ‘జాక్ పాట్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆయన ఆకట్టుకున్నారు.
హారర్ కామెడీగా ‘కోస్టి’ తెరకెక్కింది. ఇందులో తండ్రి కుమార్తె మధ్య అనుబంధాన్ని కూడా చూపించారు. కథ విషయానికి వస్తే, అనగనగా అందమైన లేడీ ఇన్‌స్పెక్టర్. ఆమె పేరు ఆరతి. గ్యాంగ్‌స్టర్ దాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అతడిని పట్టుకుని తీరుతానని శపథం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఆరతి తండ్రి దాసును అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. దాసును పట్టుకునే క్రమంలో అతడిని షూట్ చేయబోయి మరొకరిని షూట్ చేస్తుంది ఆరతి. ఆ తర్వాత ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఆరతి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు. గ్యాంగ్‌స్టర్ దాస్ రోల్ ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ చేశారు. ఆరతితో పాటు పని చేసే పోలీసులుగా సీనియర్ నటి ఊర్వశి, సత్యన్ కనిపించనున్నారు. పోలీస్ కథకు, దర్శకుడు కావాలని ప్రయత్నించే యోగిబాబు పాత్రకు సంబంధం ఏమిటి? మధ్యలో మానసిక వికలాంగులకు సంబంధించిన ఆస్పత్రికి యోగిబాబు ఎందుకు వెళ్లారు? అనేది ఆసక్తికరం. సినిమాలో రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని వంటి భారీ తారాగణం ఉంది.
గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మాట్లాడుతూ ”హారర్ కామెడీ చిత్రమిది. ఇందులో హారర్, కామెడీతో పాటు థ్రిల్ ఇచ్చే అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఉలిక్కిపడి సన్నివేశాలు ఉన్నాయి. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రను కాజల్ అగర్వాల్ పోషించారు. అలాగే, అందంగానూ కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త కాజల్ కనపడతారు. ఊర్వశి, యోగిబాబు, కెఎస్ రవికుమార్, మనోబాల అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన యంగ్ తమిళ హీరో అతిథి పాత్రలో కనిపించారు. ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుంది. సామ్ సిఎస్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఉగాదికి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమిది. ఈ నెల 22న థియేటర్లలో విడుదల చేస్తున్నాం” అని చెప్పారు.

Related posts

Leave a Comment