తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య 12వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆయన పేరున ఏర్పాటు చేసి ఏటా సాహిత్య, కళారంగాలలో విశేష కృషి చేస్తున్న ఇద్దరికి ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం’ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పొన్నం రవిచంద్ర తెలిపారు.
ఈ పురస్కారానికి జ్యూరీ చైర్మన్ గా పొన్నం రవిచంద్ర, జ్యూరీ సభ్యులుగా ప్రముఖ న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి, తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కవి రచయిత్రి ఐనంపూడి శ్రీలక్మి ఉన్నారని .. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి 25 వేల రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం, దుశ్శాలువతో సత్కరించడం జరుగుతుందన్నారు.
ఈ ఏడు 2022కు గాను సాహిత్య విభాగంలో ప్రముఖ కవి “నాళేశ్వరం శంకరం”, కళాకారుల విభాగంలో ప్రముఖ ఒగ్గు కళాకారుడు “ఒగ్గు ధర్మయ్య”లను జ్యూరీ ఎంపిక చేసినట్లు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పొన్నం రవిచంద్ర ప్రకటించారు.
హైదరాబాద్ లో ఈ నెల 13న రవీంద్రభారతిలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్ట్ తెలిపింది. కార్యక్రమ పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.