ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్తు హెల్ప్ లైన్ సెంటర్ హెల్ప్ డెస్క్

Spread the love

టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అడ్మిషన్లు ప్రారంభం అయినందున దోస్తు హెల్ప్ లైన్ సెంటర్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ అడ్మిషన్లు పొందడానికి పక్రియ మొదలైందని జూలై 15 తేదీలోపు రెండు వందల రూపాయలు చెల్లించి BA ఆర్ట్స్, B.COM కంప్యూటర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం BZC,BSC,MPCS ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కోర్సులకు ఆన్ లైన్ దోస్తు ద్వారా అడ్మిషన్లు పొందగలరని తెలిపారు. అలాగే హిస్టరీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ ప్రొఫెషనల్ ధీరావత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరులో ఉందని , పది ఎకరాలతో విశాలమైన భవనాలతో అన్ని సదుపాయాలతో పాటు కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, లైబ్రరీ సౌకర్యం, అనుభవం కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల ద్వారా శిక్షణ తరగతులు ఇవ్వటం జరుగుతుందని ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ ఐ మరియు వివిధ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని హిస్టరీ సబ్జెక్ట్ మెరిట్ సాధించిన నలుగురు విద్యార్థిని విద్యార్థులు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ సెలెక్ట్ కావడం జరిగిందని, అనేక మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉత్తమ ర్యాంకులు సాధించె ఈ విధంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ, డాక్టర్ కె. హరిత, విద్యాసాగర్, జైపాల్, రాజు, ప్రవీణ్ కుమార్, కరుణాకర్, సుజాత, జానీ, రేవంత్, రేఖ, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment