పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా ముఖ్య పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ ఇటీవలనే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ! కరోనా కాలం తరువాత అశేష ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చిన భీమ్లా నాయక్ ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ మొదలైన భీమ్లానాయక్ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు. మార్చి 25 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’ అని ‘గబ్బర్ సింగ్’లో చెప్పినట్లుగా ‘భీమ్లానాయక్’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై పవన్ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఓ సినిమా ప్రమోషన్ కోసం భారీ స్ధాయిలో ఎలివేషన్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పవన్ కళ్యాణ్ మాస్కులు ధరించి సందడి చేసిన అభిమానులు నెక్లెస్ రోడ్‌లో సందడి చేయడమే కాదు, ఈ ఎలివేషన్‌ను ఆవిష్కరించారు. ఓ క్రేన్ కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలతో వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు. డిస్నీ+హాట్‌స్టార్‌లో భీమ్లా నాయక్ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘భీమ్లానాయక్’ ఎలివేషన్ !
