హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదిక వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందడుగు వేశారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇంతితై వటుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వరకు 21 ఏండ్లుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు. ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ సారధ్యంలో 21 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను కైవసం చేసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఉద్యమ ఆంకాంక్షలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు బొట్ల పరమేశ్వర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిబద్ధమైన, సువ్యవస్థీతమై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనిఆయన పేర్కొన్నారు. 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట అని, దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది అని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగుల తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ నేతృత్వంలో జరిగిందని తెలిపారు. ఇది మన అంకిత భావానికి మంచి ఉదాహరణ. ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఎందరో మహానుభావులు, గొప్పవాళ్లు, పార్టీకి అంకితమై పని చేసే నాయకుల సమాహారమే ఈ ఫలితాలకు కారణం అని బొట్ల పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్నాం. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు కాషాయ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రజలు లేక వెలవెలబోతున్నదని ఎద్దేవా చేశారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలున్నాయి. చుట్టూ అంధకారమే ఉన్నప్పటికీ.. మణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్నది అని, ఇది కేవలం మన సీఎం కేసీఆర్ ప్రతిభవల్లే అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ దశ, దిశగా మారిపోయిందని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. జీఎస్‌డీపీలో రాష్ట్రం వృద్ధి సాధించిందని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణప్రగతిలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. చిన్న రాష్ట్రాల ఆవిర్భావం అనే అంశం, దేశ రాజకీయాలు, జాతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్న సమయంలో, తన రాజకీయ చతురతను ప్రదర్శించి, దేశంలోని వివిధ పార్టీల మద్దతును కేసీఆర్ కూడగట్టారని పేర్కొన్నారు. మొదటిసారిగా తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయ ఎజెండాలో చేర్చి , రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి, వివిధ పార్టీలతో జై తెలంగాణ అనిపించడానికి ప్రజా పోరాటాలను నిర్మించారని తెలిపారు. అంతిమంగా రాజకీయ ప్రక్రియ ద్వారా రాజ్యాంగ బద్ధంగా, శాంతియుతంగా, దేశ భౌగోళిక చిత్రపటాన్ని మారుస్తూ 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో టిఆర్ఎస్ పాత్ర అద్వితీయం అని బొట్ల ప్రశంసించారు. రాష్ట్ర సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. వారితో నడిచిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన గులాబీ జెండా, టీఆర్ఎస్ పార్టీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న క్షణాన ఆనందంగా ఉందన్నారు తెలంగాణ ప్రజల గుండెల నిండా… గులాబీ జెండా ఉందని చెప్పారు. 2001లో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల్లోంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రం కోసం కొట్లాడి, స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నది వెల్లడించారు. కోట్లాది ప్రజల మద్దతు, కార్యకర్తల బలంతో టీఆర్ఎస్ సగర్వంగా 21వ వసంతంలోకి అడుగుపెట్టిందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.
Related posts
-
తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్
Spread the love సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ... -
ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం
Spread the love సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్... -
సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్
Spread the love వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె...