స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఆగష్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు. అఫిషియల్ గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఆగష్టు 13న రావాల్సిన పుష్ప వాయిదా పడింది. అయితే.. ఆగష్టు 13న సినిమా విడుదల చేయడం లేదు కాబట్టి.. పుష్ప ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఆగష్టు 13న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. చెప్పిన సమయం కంటే ముందుగా పుష్ప ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది. అది కూడా రఫ్ కట్ వచ్చింది. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఈ సినిమా టీజర్ ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు ఉదయం రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా అర్ధరాత్రే సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు పుష్ప కూడా చెప్పిన సమయం కంటే ముందుగా రిలీజ్ అయ్యింది.
ఈ రెండు లీకుల ఘటనలు చూస్తే…ఆ రెండు వాళ్ళ టీం నుంచి బయటికి వచ్చినవే అనిపిస్తోంది. టీజర్ బయటి జనాలకు ముందే చేరే అవకాశం లేదు లీక్ చెయ్యడానికి. ఆ సినిమా పబ్లిసిటీ టీమ్ నుంచో, డైరెక్టర్ టీం నుంచో బయటికి రావాలి. ఇక పుష్ప పాటకి సంబంధించి రఫ్ కట్ ఎవరి దగ్గర ఉంటుంది? సో, ఇవి నిజంగా లీకు అయ్యాయా? లీకు చేయించారా? అన్న అనుమానాలు రావడం సహజం. ఈ సంఘటనలు చూస్తుంటే.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అప్పల్రాజు సినిమాలోని పాట గుర్తు రాకమానదు. పబ్లిసిటీ …పబ్లిసిటీ.. ఇది సినిమావాళ్ళ ఆక్టివిటీ..