పార్టనర్‌షిప్‌ ఫర్‌ గ్రోత్‌ 3.0ను విడుదల చేసిన NXTDIGITAL

NXTDIGITAL
Spread the love

తమ నెట్‌వర్క్‌ను 40 నూతన NXTHUB లతో దేశవ్యాప్తంగా విస్తరణ : తమ యాప్స్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటన

భారతదేశ వ్యాప్తంగా 40 నూతన NXTHUBs ఏకకాలంలో ప్రారంభం – ప్రతి ఒక్కటీ 650కు లైవ్‌ టీవీ ఛానెల్స్‌ మరియు బ్రాండ్‌బ్యాండ్‌ అందిస్తాయి. ప్రస్తుతం 4400 పిన్‌కోడ్స్‌ వ్యాప్తంగా NXTDIGITAL కు ఉన్న ప్రస్తుత కవరేజీకి జోడింపు
•ప్రతి NXTDIGITAL సొంతమైన మరియు నిర్వహిస్తున్న NXTHUBs లోనూ యాడ్స్‌ లేదా అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది లాస్ట్‌ మైల్‌ ఓనర్స్‌ (LMOలు)కు ప్లగ్‌ అండ్‌ ప్లే పరిష్కారం అందిస్తుంది. ఈ వీడియో పరిష్కారం HITS లేదా Headend-In-The-Sky సాంకేతికత ఆధారంగా ఉంటుంది. ఇది శాటిలైట్‌ ఆధారితం కావడంతో పాటుగా వాతావరణం, భౌగోళిక పరిస్థితులు లేదా కనెక్టివిటీ అవరోధాలు ఉండవు.
•హెడ్‌–ఎండ్స్‌ లేదా సంబంధిత సాంకేతికలో ఎల్‌ఎంఓలు పెట్టుబడులు పెట్టే అవసరాన్ని తొలగిస్తుంది ; అత్యున్నత నాణ్యత కలిగిన సేవా స్ధాయితో వారి వినియోగదారులకు పలు డిజిటల్‌ సేవలను అందించవచ్చు.
•దేశవ్యాప్తంగా మరో 60NXTHUBs ను ఏర్పాటుచేయనున్నారు. ఈ NXTHUB లు అన్నీ కూడా భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా ఉండటంతో పాటుగా ఓటీటీ మరియు వైఫై సహా పలు డిజిటల్‌ సేవలను వినియోగదారులకు అందించనున్నాయి.
•వృద్ధి కోసం భాగస్వామ్యాలు అనే కంపెనీ యొక్క సిద్ధాంతంలో భాగంగా– తమ LMOలు నూతన ఉత్పత్తులు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగించుకునేందుకు భరోసా, తద్వారా సంబంధితంగా ఉండటానికి మరియు వారు వృద్ధి చెందేందుకు తోడ్పాటు
•డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌కు తోడ్పాటునందిస్తూ NXTDIGITAL తమ అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేజస్‌ (ఏపీఐలు)ను LMO లకు తెరిచింది. తమ VAAP (వాల్యూ యాడెడ్‌ యాప్స్‌ ఫర్‌ పార్టనర్స్‌) ప్రోగ్రామ్‌ కింద ప్రీ ఇంటిగ్రేటెడ్‌ మొబైల్‌ యాప్‌ ప్రకటన.
హైదరాబాద్‌ , 27 అక్టోబర్‌ 2021 ః గ్లోబల్‌ హిందుజా గ్రూప్‌ కు చెందిన మీడియా విభాగం మరియు డిజిటల్‌ కేబుల్‌, HITS (హెడెండ్‌ ఇన్‌ ద స్కై) , బ్రాడ్‌బ్యాండ్‌, కంటెంట్‌ మరియు టెలిషాపింగ్‌ అందిస్తున్న భారతదేశపు ప్రీమియర్‌ ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ NXTDIGITAL లిమిటెడ్‌ (ఎన్‌డీఎల్‌) నేడు భారతదేశ వ్యాప్తంగా 40NXTHUBs ను ప్రారంభించడంతో పాటుగా తమ లాస్ట్‌మైల్‌ ఓనర్స్‌ (ఎల్‌ఎంఓలు) కోసం విలువ ఆధారిత యాప్‌ను సైతం విడుదల చేసింది. రాంచీలో ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత ఈ NXTHUBs ను హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎలకా్ట్రనికల్‌గా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక సహా 13 రాష్ట్రాలలో ప్రారంభించింది.
ఎన్‌డీఎల్‌ యాజమాన్య మరియు నిర్వహణలోని ప్రతి NXTHUBs, ADDS లేదా అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ ను సైతం కలిగి ఉంటుంది. శాటిలైట్‌ ద్వారా అందుకున్న 650కు పైగా డిజిటల్‌ టీవీ సేవలను ఎల్‌ఎంఓలకు మరియు వారి వినియోగదారులకు పంపిణీ చేస్తుంది. ఈ NXTHUB ప్లగ్‌ అండ్‌ ప్లే మోడల్‌తో ఎల్‌ఎంఓలు హెడ్‌ఎండ్‌ మరియు సంబంధిత సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టే అవసరం తొలుగుతుంది. వీడియో మరియు బ్రాడ్‌బ్యాండ్‌ తో పాటుగా ఈ NXTHUB భావి అవసరాలకు సిద్ధంగా ఉండి ఓటీటీ మరియు వై–ఫై సహా పలు అదనపు డిజిటల్‌ సేవలను సైతం అందించనున్నాయి.
ప్రతి ప్రాంతాన్నీ వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా కంపెనీ యొక్క పాదముద్రికలను విస్తరించే రీతిలో ఎంపిక చేసుకున్నారు. నేడు దేశవ్యాప్తంగా 4400 పిన్‌కోడ్స్‌ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా పెట్టుబడుల కారణంగా ఎల్‌ఎంఓల వృద్ధికి అవరోధంగా నిలిచిన మార్కెట్‌లపై దృష్టి సారిస్తుంది. ఎల్‌ఎంఓల కోసం, ఈ ప్లగ్‌ అండ్‌ ప్లే సొల్యూషన్‌ రాత్రికి రాత్రే వారు డిజిటల్‌గా మారేందుకు సహాయపడటంతో పాటుగా వారి వినియోగదారులకు 650కు పైగా డిజిటల్‌ టెలివిజన్‌ ఛానెల్స్‌ మరియు బ్రాండ్‌బ్యాండ్‌ సహా ఇతర డిజిటల్‌ సేవలను అందించేందుకు తోడ్పడుతుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఈ తరహా 100NXTHUB ను ఏర్పాటుచేయాలని ఎన్‌డీఎల్‌ ప్రణాళిక చేసింది. తద్వారా దేశవ్యాప్తంగా ఎన్‌డీఎల్‌ తమ విస్తరణను మరింతగా బలోపేతం చేసుకోనుంది.
NXTDIGITAL లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో విన్ల్సీ ఫెర్నాండేజ్‌ మాట్లాడుతూ ‘‘ వృద్ధి కోసం భాగస్వామ్యాలు అనేది హిందుజా గ్రూప్‌ కీలక సిద్ధాంతాలలో ఒకటి. భారతదేశంలో ఒకే ఒక్క శాటిలైట్‌ ఆధారిత కేబుల్‌ టీవీ వేదిక ద్వారా తాము 2.0 లో భాగంగా దేశంలో మారుమూల ప్రాంతాలలోని ఎల్‌ఎంఓలను సైతం కనెక్ట్‌ అయ్యేందుకు HITS ఆవిష్కరించాం ; 3.0తో మేము అభివృద్ధి చేసిన వ్యవస్థలను కేవలం బలోపేతం చేసుకోవడంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం కాకుండా, విభిన్న సాంకేతికతల సమ్మేళనాన్ని NXTHUBs యొక్క జాతీయ నెట్‌వర్క్‌ ద్వారా అందించనున్నాము. ఎల్‌ఎంఓలు మరియు చందాదారుల కోసం ప్రత్యేకంగా సర్వీస్‌ ప్రొవైడర్లచేత అభివృద్ధి చేయబడిన వినూత్న యాప్‌ల యొక్క శక్తివంతమైన కలయికతో మేము అభివృద్ధి చేసిన సేవలలో వీడియో మరియు బ్రాడ్‌బ్యాండ్‌ అనేవి కేవలం ప్రారంభం మాత్రమే’’ అని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణా రీజనల్‌ హెడ్‌–NXTDIGITAL ఎస్‌ వై శ్రీ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ మేము ప్రారంభించిన 40NXTHUBs లో 16 ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలోనే ఉండటం పట్ల మేము సంతోషంగా ఉన్నాము.అలాగే జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఆవిష్కరణలు హైదరాబాద్‌ నుంచి జరుగుతుండటం ఇక్కడి ఎల్‌ఎంఓలు మరియు అత్యున్నత నాణ్యత కలిగిన సేవలను కోరుకుంటున్న మా చందాదారుల పట్ల మా నిబద్ధతను వెల్లడి చేస్తుంది. ఈ వినూత్నమైన నమూనా వృద్ధిని వేగవంతం చేయనుందని మేము నమ్ముతున్నాం మరియు మేము కేవలం నూతన ఉత్పత్తులను మాత్రమే కాదు మరిన్ని NXTHUBs ను ఈ ప్రాంతంలో తీసుకురానున్నాం’’అని అన్నారు.

Related posts

Leave a Comment