పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం’ నుంచి ‘సింగిల్ లైఫ్ అంటే..’ పాట విడుదల.. పాటలో మెరిసిన శర్వానంద్

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!
Spread the love

యువ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”. ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే అనే పాటను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ పాటలో మరో స్టార్ హీరో శర్వానంద్ కనిపించడం విశేషం.
సింగిల్ లైఫ్ గొప్పదని చెప్పుకునే యువత..రేపు మిడిల్ ఏజ్ వచ్చాక ఏ తోడు లేకుండా పోతుందనే విషయాన్ని ఆలోచించడం లేదని…లైఫ్ లో పెళ్లి చాలా ముఖ్యమని ఈ పాట ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించి పాడారు. పెళ్లయ్యాక శృతితో శివ పడుతున్న కష్టాలు చూసిన శర్వానంద్..మ్యారేజ్ చేసుకున్నాక ఇలా ఉంటుందా అని భయపడుతుంటాడు. ఈ పాట చూపించాక అతనిలో ఓ ఛేంజ్ కనిపిస్తుంది. వెంటనే ప్రభాస్ అన్నా అంటూ ఫోన్ చేసి..ఆయన వెడ్డింగ్ గురించి ఆయన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సరదాగా ఉన్న ఈ పాటకి కాన్సెప్ట్ మరియు దర్శకత్వం అనిల్ చేసారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ – సత్య జి, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం – కృష్ణ కాంత్, కొరియోగ్రాఫర్స్ – యష్, విజయ్ పోలంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు, ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్, సహ నిర్మాత – అజయ్ కుమార్ రాజు పి, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.

Related posts

Leave a Comment