విశిష్టమైన కార్యక్రమాల ద్వారా ఉన్నతమైన సేవలను అందిస్తూ హైదరాబాద్ కు చెందిన ‘ఆరాధన’ సంస్థ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. గత 25ఏళ్లుగా లెక్కకు మించి కార్యక్రమాలు నిర్వహించి వివిధరంగాలకు చెందిన ఎందరినో గుర్తించి సత్కరించి..అవార్డులను అందజేస్తూ వస్తోంది. అందులో భాగంగానే నేడు (18న) తన 26వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ‘విజయంలో భార్యాభర్తల భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించే ఈ వార్షికోత్సవం సోమవారం 18న హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు జరగనుందని ‘ఆరాధన’ వ్యవస్థాపకులు, ప్రధానకార్యదర్శి లోకం కృష్ణయ్య తెలిపారు.
ఈ సందర్బంగా నిర్వహించే వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, సన్మాన కర్తలుగా సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి దేవస్థానం కు చెందిన ప్రధానార్చకులు శ్రీ బి. రామతీర్థ శర్మ, శ్రీమతి బి. రాజ్యలక్ష్మి, సభాధ్యక్షులుగా లయన్స్ క్లబ్ ఆర్య అధ్యక్షులు, కళాపోషకులు లయన్ డా. చిల్లా రాజశేఖర రెడ్డి, అతిథి సత్కారం సినీ నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ డా. సి. వి. రత్నకుమార్, ఆత్మీయ అతిథులుగా కళాపోషకులు డా. వీరభోగ వసంతరాయలు , శ్రీ తిరుమాని చంద్రశేఖర్, సన్మాన స్వీకర్తలుగా సీనియర్ పాత్రికేయులు శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రి, ప్రముఖ నాటక రచయిత దీపిక ప్రసాద్ లు స్వర్గీయ చింతలచెరువు వెంకట రామారావు స్మారక నగదు పురస్కారాలను, గుండు మధుసూదన్, సామాజిక సేవ – ‘సత్య’ ఛానల్, హనుమకొండ ఉపేంద్రాచారి, సామాజిక సేవ – ‘మహాన్యూస్’ ఛానల్ సత్కారాల్ని అందుకోనున్నారు. ‘విజయంలో భార్యాభర్తల భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించే ఈ వార్షికోత్సవంలో పురస్కార స్వీకర్తలుగా డా. గండికోట వెంకట సోమయాజులు – శ్రీమతి లక్ష్మి( ఆషా హాస్పిటల్), శ్రీ బోట్ల శ్రీనివాస్-శ్రీమతి యాదలక్ష్మి(కార్పోరేటర్ -బి.జె.పి నాయకులు), శ్రీ ఇనుగాల యుగేందర్ రెడ్డి -శ్రీమతి కరుణ (సమాజ సేవకులు-బి.జె.పి నాయకులు), శ్రీ విజయకృష్ణ-శ్రీమతి భావన (బుల్లితెర దర్శకులు, నటి), ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ డి. వై. సుబ్బారెడ్డి – శ్రీమతి నాగ మల్లేశ్వరమ్మ, అంతర్జాతీయ కళాకారుడు శ్రీ గంధం సంతోష్-శ్రీమతి శైలజలు సత్కారాల్ని స్వీకరించనున్నారు. వార్షికోత్సవం ప్రారంభించే ముందు సాయంత్రం 5 గంటల నుండి 6.30 వరకు స్వరసుధాఝరి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ‘అశ్వాత్తమ సంగీత పురస్కార గ్రహీత పదకోకిల పద్మశ్రీ నిర్వహణలో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సినీ మధుర గీతాల సంగీత విభావరి ఉంటుంది. శ్రీమతి పద్మశ్రీ, శ్రీ త్యాగరాజు, శ్రీ సంపత్ కుమార్, శ్రీ కె. జగన్నాధరావు, శ్రీ సంజయ్ భరద్వాజ్ , శ్రీమతి స్వర్ణలత గీతాలను ఆలపించనున్నారు. ఈ సందర్బంగా జరిగే వార్షికోత్సవానికి సెలక్షన్ కమిటీ సభ్యులుగా లయన్ ఎం.ఏ హమీద్, శ్రీ తిరుమాని చంద్రశేఖర్, నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. అబ్దుల్ వ్యవహరించారు. ‘ఆరాధన’ ఉపాధ్యక్షులు ఎం. రమణాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.ఆర్. రాజేశ్వరరావులు ఈ ‘ఆరాధన’ వార్షికోత్సవంలో పాలుపంచుకుంటారు.